ప్రత్యేక హోదా రాకపోతే పవన్ దానికే సిద్ధపడతారా...?

Shyam Rao
చేసింది కొన్ని సినిమాలే అయినా.. వాటితోనే ప్రేక్షకుల విశేష ఆదరనలను పొంది పవర్ స్టార్ గా పేరొంది సామాజిక అవగాహన ఉన్న హీరోగా పేరొందిన వ్యక్తే పవన్ కల్యాణ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని అధికార, విపక్షాలు, ప్రజలందరు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ విదితమే. అయితే ఈ విషయం పై ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని, ప్రజల తరుపున అండగా నిలబడాలని ఇప్పటివరకు చాలా మంది నేతలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ విదితమే. 



అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న రాజకీయ సమస్య ప్రత్యేక హోదా విషయం పై మాట్లాడానికి మొన్న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించిన విషయం అందరికీ విదితమే. అయితే, ఈ సభలో పవన్ అధికార పార్టీలైన టీడీపీ, బీజేపీ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని మాట ఇచ్చిందని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని లేని పక్షంలో ఈ ఆవేశం ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని, కేంద్ర మంత్రులు తుమ్మితే ఊడిపోయే పదవులను పట్టుకొని వేలాడుతున్నారని, వెంటనే వారు వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 



గతంలో బీజీపీ కాకినాడ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన మాటకు కట్టుబడాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమంలో భాగంగా మొదటి సభను కాకినాడ లో నిర్వహిస్తానని తేల్చి చెప్పారు. అయితే ప్రస్తుతం కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించని పక్షంలో పవన్ దేనికి సిద్ధపడతారు...? ఈ విషయాన్ని అదునుగా తీసుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడతారా...? లేక ప్రత్యేక హోదా కల్పిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్ధతుపలుకుతారా...? 



పవన్ ప్రసంగం అంతరంగాన్ని పరిశీలిస్తే పవన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో బాహా బాహీకి దిగుతున్నాడని స్పష్టంగా అర్థం అవుతుంది. కారణం ఆయన స్థాపించిన పార్టీకి ప్రజాదరణ ధక్కడమే. పవన్ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లోకి ప్రవేశిస్తే కొన్ని సీట్లైనా ధక్కుతాయనే ధీమా ఆయనకు ఉంది. అందుకే దశల వారీగా సమావేశాలు జరిపి ప్రజా మద్ధతు కూడగట్టదానికి సిద్ధపడుతున్నారు పవన్. పవన్ పార్టీ ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంది. 



అంతేకాక అధికార పార్టీలకు పరోక్షంగా మద్దతు సైతం ప్రకటించింది. ఈ తంతు ఇలానే కొనసాగిస్తే పవన్ పార్టీ అధికార పార్టీలకు కొమ్ము కాస్తుందనే ఆరోపణను ఆ పార్టీ ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే తన పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టాలంటే పార్టీని ప్రజాక్షేత్రం లోకి తీసుకెళ్లాలి. పార్టీకి ప్రజల ఆదరణ లభించాలంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాల ని సమాలోచనలు చేసిన పవన్ అందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: