కురుక్షేత్రం లో స్విస్ చాలెంజ్ కథ

భగవాన్ శ్రీకృష్ణుడు ధర్మం ప్రక్కన నిలబడతారు. పాండవులు ధర్మానికి ప్రతినిధులు. అధర్మం చేత అనుక్షణం వంచించ బడ్డారు. అందుకే భగవానుడు అధర్మాన్ని అణచి వేయటానికి ధర్మాన్ని నిలబెట్టటానికి పాండవ పక్షాన నిలబడ్డారు. ధర్మ క్షేత్రములో తుది విజయం పాండవులకే దక్కించారు. "ధర్మం ప్రక్కన నిలిస్తే పాండవ పక్షమే. పాండవ పక్షాన నిలిస్తే ధర్మం ప్రక్కన  నిలిచినట్లే"  అందుకే ఆయనకు "పాండవ పక్షపాతి"  అని ముద్రపడింది.


అయితే ఈ సొద ఎందుకంటారా! చంద్రబాబు ఏంచేసినా, ఎలాచేసినా, ఎవరు మన ఘనత వహించిన ధర్మ న్యాయస్థానాలలో ఆయనకు వ్యతిరేకంగా పిర్యాదు వేసినా



*ఆ పిర్యాదుకు ఎక్కువ సార్లు విచారణార్హత ఉండదు.

*ఆయన వ్యక్తిగతంగా పొందిన ప్రయోజనాలను అనుమానాస్పదాలనరాదు

*ఆయన నాయకత్వ విధానాలకు మన ఘనత వహించిన ధర్మ న్యాయస్థానాల్లో ప్రశ్నార్ధకాలు కావు

*కొన్ని విషయాల్లో ఆయనను అదుపుచేసే అవకాశాలున్న చోట ఆయనకు అనుకూలంగా స్టే వస్తుంది

*న్యాయ పరిశీలనకు గతములో తామిచ్చిన తీర్పులనే అధారాలుగా చూపే సందర్భాలకు కూడా - బాబు వర కొచ్చే సరికి గ్రహణం పడుతుంది.

*అందుకే సిబిఎన్ కు వ్యతిరేఖంగా - వ్యవహారానికిగాని, విధానానికిగాని, వ్యాపారానికిగాని మన ఘనత వహించిన ధర్మ న్యాయస్థానాలలో పిర్యాదు చేసిన వారికి అక్షింతలు పడతాయి.  ఎందుకంటే బాబు ధర్మపతాక. ధర్మప్రతీక, ధర్మమూర్తి, మూర్తీభవించిన న్యాయ స్వరూపం.



అందుకే మహాభారతం పై అవగాహన ఉన్నవారికి ప్రతివిషయములో పాండవులే ఎందుకు విజయం సాధిస్తూ ఉంటారంటే "ధర్మ  పక్షపాతి ధర్మ పక్షపాతి"  పాండవపక్షం వహించటమే.


శిఖండిని అడ్డుపెట్టుకొని భీష్ముని తప్పించారు...అది ధర్మమే...ఎందుకు అంటే శ్రీకృష్ణుని సలహా...అంటే ధర్మ సంస్థాప నార్ధాయః అంటారు


అశ్వథామ హతః అని ద్రోణుని పీచమణచినా .... ధర్మ సంస్థాపనార్ధాయః .... ధర్మ పరిరక్షణ కోసమే. ఇలా చెప్పుకుంటూ పోతే వందల్లో ధర్మాలు రక్షించ బడ్డాయి. వాటికి భగవానుడే కర్త, కర్మ, క్రియ.


కలియుగ యుగధర్మం ప్రకారం ధర్మ న్యాయస్థానాల్లో గెలిచిందే న్యాయం. ఇక్కడ ఆ ధర్మ న్యాయాలయం ఎవరి పక్షాన తీర్పిస్తుందో వారినే విజయం వరిస్తుంది.  వారే “పాండవుడు”. మొత్తం భారత్ లో ఇలా విజయాలు ఒకె వ్యక్తి  పొందితే పొందుతూ ఉంటే ?  అదీ  ఏకైక వ్యక్తి అయితే - వారే  "పాండవుడు - (పాండవులు - కు - సింగులర్ - గా అనవలసి వచ్చింది)


స్విస్ చాలెంజ్ విధానమే దుష్ఠ నష్ట భూయిష్టమన్నది కేల్కర్ కమిటీ. ఆ కమిటీ ఆ విధానంపై అధ్యయనం చేయించడానికి భారత ప్రభుత్వంచే నియమించబడింది. మరి ఇదేమిటి? సర్వోన్నత న్యాయస్థానాల గత కాలములో వెలువరించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చూసినా కూడా! టెండర్ నోటిఫికేషన్లను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జారీ చేయడం చట్టబద్ధం కాదు సమర్థనీయం కాదు. కోర్టు కూడా ఈ విధానం విషయంలో ప్రభుత్వాలని తప్పుపట్టింది గతంలో అంటారా! మనకు ఉండనే ఉంది "గతం గతః" అనే సూక్తి - ధర్మోక్తి.


మరి స్విస్ ఛాలెంజ్ విధానంలోని లోటు పాట్లను ఇక్కడ జరగుతున్న గూపుఠాణియో - మోసాన్ని దాన్ని ప్రస్తావిస్తూ-కొంతమంది కోర్టు మెట్లెక్కి తలుపు తట్టారు. మరి వీళ్లు ఎన్ని లొసుగులను, లోపాలను దుర్యో ధనాదులకు మల్లే ఎత్తి చూపినా - న్యాయమెప్పుడూ ధర్మం పక్షానే ఉంటుంది కాబట్టి బాబు ప్రభుత్వ విధానానికి చుక్కెదురవుతుందనేది కేవలం కల -  పగటికల, మన మతి భ్రమణం చెంది కనిపించే భ్రమ.

 

మహాభారత కధ తెలిసీ కోర్టుకు ఎక్కిన వారిని చూస్తుంటే, బహుశ కోర్టు చేత అక్షింతలు వేయించుకోవటానికే కదా! అని అనిపిస్తుంది. న్యాయం వినటానికి నిరీక్షించటం తప్ప! న్యాయస్థానాల్లో దిమ్మతిరిగే ఎదురుదెబ్బ చివాట్ల రూపంలో తిని - అక్షింతలైనా వేయించుకొని వెనక్కు రావడం థధ్యం సుమతీ!   ఎలా వస్తారో వారి ‘ఫేసు ఎలా  టర్నింగ్ ఇచ్చుకుంటారో?’ మన ముందని చూస్తూ ఉందామా!


కడవరకు ధర్మం దరికి చేరలేని సుయోధనుడు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: