'పవన్' కు కూడా అర్థం కాని అప(ర-ర)హస్యమా..! అమరావతి? అంతా అనుమానాస్పదం....

నవనవ లాడే హరిత దనం తో ముంగారు పసిడి పంటలతో మిస మిస లాడే పడుచు పిల్ల సోయ గాలతో సదా విలసిల్లే  ఉండవల్లి  ప్రాంతమంతా ఎండిన మోడుబారిన బీళ్ళలా తయారయ్యా యి.    హరిత దనాన్ని పసు పచ్చ దనం గా మారుస్తున్నారు.  ఆకు పచ్చ దనాన్ని మాత్రమే పచ్చ దనం అనే వారు మా  చిన్నప్పుడు.  ఎన్.టి.ఆర్  తెలుగు దెశం పార్టీ అధికార వర్ణం "పసుపు" అప్పటి నుండి పసుపు రంగును పసుపు పచ్చదనం అనీ, ఆకుపచ్చ  రంగును ఆకు పచ్చదనం  అంటారు.  

 

పచ్చటి పంట పొలాల భూములు పసుపు పార్టీ కళ్ళు పడి ఆకుపచ్చ దనం,  ఎండిపోయి పసుపు పచ్చగా మారి,  హరితారణ్యం లా మిడిసి పడే భూసంపద కాంక్రీట్ అరణ్యం గా మారే  ప్రక్రియకు  శంకుస్థాపన  చేసింది  చంద్రబాబు నాయుడు.  కాని ఆ  కార్య క్రమానికి  ముఖ్య అదితి గా వచ్చిన నరెంద్ర మోడీ కొద్దిగా  మట్టి, నీరు తెచ్చి ఇచ్చారు. దానర్ధం “భూమి (మట్టి)  మీద నీరు పోస్తే నారు (పచ్చటి మొక్కలు)  పెరుగుతుంది.  ఆకుపచ్చదనం విలసిల్లటమే విలసిల్లాలని అన్యాపదేశంగా కోరటం“. నీ కాంక్రీట్ అరణ్యాలు  ఇక  ఇండియా కొద్దు అనే అంతరార్ధం.   


హరిత వనాల్ని మూడు పంటలు పండే పంట భూములను చట్టం పేరు చెప్పి,  గెలిపించిన ప్రజలను వంచించి బలవంతంగా లాక్కు న్నందుకు  ఈసారి ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి ఓటమి తప్పదని ప్రజలు భావిస్తున్నారు.  అమరావతి పేరు చెప్పి కొందరి కోసం ప్రజాస్వామ్యం అంగీకరించని, జనం  పులకించని రాజ్యాన్ని నిర్మించాలని చంద్రబాబు పరిజనం  ప్రణాళిక రచిస్తుంది. ప్రజలకు కావలసింది ఒక నిర్మాణ కౌశలమున్న, అన్నీ వసతులతో నున్న మంచి పరిపాలనా కేంద్రం.  రాజధాని అంటే పరిపాలనకు, ప్రభుత్వాలకు తగిన సౌకర్యాలున్న ప్రజా పాలనా ప్రాంతం.

కాంక్రీట్ జంగిల్, అమరావతి


అంతేకాని సింగపూరు, టోకియో లతో పోటీ పడే నగర నిర్మాణం జరిగితే దాన్ని వ్యాపారం అంటారు. అదే పెద్దగా చేస్తే విపణి అంటారు. ప్రజలు తెలుగు దేశం పార్టీని గెలిపించింది వ్యాపారం చేయమని కాదు. తన కుటుంబ వ్యాపారాలకు కేంద్రం చేయటానికి మహానగర నిర్మాణం  తనకు తన స్వంత కుటుంబ వ్యాపార అవసరం. ఎందుకంటే ఇక హైదరాబాదు లో బాబు గారి వ్యాపారాలు, రాజకీయాలు నడవని పరిస్థితి కలిపించారు “ఓట్ కు నోట్ కేసు”  ద్వారా. అదే బాబు నోటికి తాళం వేసింది. దాంతో ఇప్పటికే చంద్రబాబు తన ఖాందాన్ తో ఆల్మోస్ట్ విజయవాడకు పారిపోవటమే కాదు, అంధ్రప్రదేశ్ ప్రజలకు విభజన అన్యాయం (సమ్మతి లేఖ ఇచ్చి)  కట్టపెట్టడం తో పాటు, ఒక దశాబ్ధం పాటు అవసరమైతే మరో అర దశాబ్ధం పొడిగించు కొని రాజధానిని తెలంగాణా తో పంచుకొనే “లక్షల కోట్ల విలువైన వసతి” ని తన వ్యాపార స్వార్ధం కోసం, “ఓట్ కు నోట్ కేసు”  కు భయపడుతూ  లేకుండా చేశారు చంద్రబాబు. ఇక్కడ ఒక బలమైన నాయకుని అవసరం ఉంది. బలహీనులను బయపెట్టటం పేదలను తన్, మన్, ధన్ తో వంచించటం అమరావతి సహజ లక్షణం. కాల్మనీ అడుగుజాడలు రహదారులుగామారి వ్రేళ్ళు ఊడలై సెక్స్ ఉగ్రవాదం నడుస్తుందంటారు ఇక్కడి జనం. దీనికి అమరావతిలోని బలిసిన ఒక వర్గమేనని వాదిస్తారు. ఒక రకమైన భూస్వామ్య లక్షణమును మించి అనేక రంగాలను “మావాళ్ళ తో నిపేశాం”  అన్నట్లు సర్వేసర్వత్రా మేమే అనెలా ఇతరులకు కనీసం వసతి కూడా కలిపించని ఒక ప్రత్యేక దుర్గమమైన కోట లాంటి లంకా నగరాన్ని తయారుచేశేశారు. ఒక కుల వర్గం మాత్రమే ఎదిగేలా ఇతరాంధ్రులకు అవకాశం లేని వాతావరణం నిర్మించారంటారు ఇప్పటికే.  వీటి గురించి చంద్రబాబు నెందుకు ప్రశ్నించరు ఆంద్రప్రదేశ్ ప్రజలు ? బాబు స్వయంకృతాపరాధమే ఈ బలహీనతలకు కారణమై కెసిఆర్ అన్నా, మోడీ అన్నా బాబు కు గుండెల్లో దడ పుట్టిస్తుందా? అనేది పలువురి వాదన.


తమ కుటుంబం-తమ వారసత్వం-తమ వ్యాపారం


 

దీనిని అర్ధం చేసుకోలేని అంధ్రప్రదేశ్ ప్రజలు, బాబేదో విశ్వనగరం నిర్మించి ఊడబొడుస్తాడని ఇంకా నమ్ముతున్నారు అంధులై.  ఇప్పటికే భూదందా పూర్తైంది. ఇక మీటర్ల లెక్కన విదేశీ వ్యవస్థ లకు భూమిని అమ్మివేసి మారోసారి ఇండియాని విదేశీ శక్తుల చేతిలోకి నెట్టివేసే  ప్రక్రియ ప్రారంభమైంది. విభజనతో "నా కుటుంబం సేఫ్" అన్నట్లు సిబిఎన్ చేతిలో పడకుండా తెలంగాణా రక్షించబడింది.  తెలంగాణాలో "ఎం ఎల్ ఏ ల ఫిరాయింపు" ప్రారంభించింది టిడిపినే. ఆట మొదలెట్టింది బాబు,  ముగించింది కెసిఆర్.  ఇక ఈ నమ్మకద్రోహంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ జనాల పరిస్థితేమిటి?


శాసనసభ లో వైరిపక్షం లేకుండా అంత సొమ్ము పోసి ఎం.ఎల్.ఏ. లను కొనెయ్యవలసిన అవసరమేమిటి?  ప్రజలు ఈ ప్రశ్నకు సమాదానాన్ని బాబు నుంచి రాబట్టాలి. మోడీని బిజేపిని ప్రత్యేక స్టేటస్ కోసం నిగ్గదీసే ముందు ఎన్నికల్లో తామిచ్చిన మాండేట్ ను (గెలిపించిన వారే పార్టీకి చెందిన ఎం.ఎల్.ఏ లనైనా) గౌరవించని ధర్మం, న్యాయం కనీసం చట్టాన్ని గౌరవించని (పార్టీ ఫిరాయింపు చట్టం మరచి) ఈ దుర్మార్గాన్ని నడిపిస్తున్న తెలుగు దేశం పార్టీ చేసే ఈ దౌష్ట్యాన్ని ప్రోత్సహించే ఈ నాయకుడు రేపు విశ్వనగరం న్యాయం గా నిర్మించగలడని నమ్ము దామా? పార్టీ మారకుండా విచ్చలవిడిగా ప్రశ్నించిన రోజాని శాసన సభ నుండి తరిమేసిన విధానంలో “అరబ్ కామెల్ కథలోని కామెల్” లా విదేశీ విఫణి సంస్థలు ఆంధ్రులను తన్ని తరిమేయవని గ్యారంటీ ఏమిటి? అప్పటికే బాబు, మామను వెన్నుపోటు పొడిచినంత తేలిగ్గా, తెలంగాణా ఎం.ఎల్.ఏ. లను (ఓట్ కు నోట్ ద్వారా టివి లలో పూర్తిగా మేం చూశాం) కొనటానికి ప్రయత్నించినంత తేలిగ్గా, ఆశ్చర్య మేముంది విజయ్ మాల్య లాగ ఏమైనా చేస్తే? ఆంద్రులు  ఆలోచించవలసిన  విషయం అని అనేక మంది  అంటున్నారు..  


నందమూరి  తారక  రామారావు  గారిని అటు అధికారము నుండి, ఇటు కుటుంబము నుండి బయటకు త్రోసి వేసిన  ఉదంతం ఒక తరం మరవలేదు. అంతే కాదు ప్రజల నుండి కూడా త్రోసి వేయటానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ రోజు ఆయన జన్మదినం. ఆయన గుర్తుకు వస్తున్నారు.  వైస్రాయ్ హోటల్లో తతంగమూ గుర్తుంది. ఆయనను తలుచుకుంటే కులం గుర్తుకు రాదు. తెలుగుదనం, సాంప్రదాయానికి నిలువెత్తు రూపం. అందుకే ఆయన అందరివాడు. ఆయన బ్రతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగివుండేది కాదు...సారీ ....తెలంగాణా వాళ్ళు తెలంగాణా కావాలని అడిగి ఉండేవారుకాదేమో? ఇది అనేకమంది గుమికూడిన చొట చర్చల్లో హృదయం ద్రవించిందన్నారందరు.

 

ఇప్పటి టిడిపి నాయకుణ్ణి తలచుకుంటే కులం, ప్రాంతం ఎక్కువలో ఎక్కువ ఆంధ్రా (ఉత్తరాంద్ర, రాయలసీమ కాదు) మాత్రమే గుర్తుకు వస్తుంది. ఇప్పుడు  తెలుగు దనం, సాంప్రదాయం అనే కంటే స్వార్ధం, కులం, ప్రాంతం, ఆంగ్లం, విదేశీయత, ధనం ఎక్కడ చూసి నా కనిపిస్తాయి పాలనలో. తన మాట నెగ్గటానికి బాబు రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా తన కులం ప్రాధాన్యమున్న కోటల్లాంటి (its never ever open up for others) ఆరెండుజిల్లాల్లోనే నిర్మించ తలపెట్టటం, తన జన్మ భూమి జిల్లా చిత్తూరును కూడా ఈ విషయంలో అలక్ష్యం చేయటం చూస్తుంటే ప్రజాసేవా దృక్పధం కనిపిస్తుందా? ఇది బిజేపి గుర్తించిందేమో? అందుకే వెంకయ్య నాయుడు గారు అన్నీ వ్యవస్థలు ఒక చోట కేంద్రీకరించటం సబబు కాదు అని కూడా అన్నారు.  

 

ప్రజల అనుమానాలు ప్రశ్నించటం ద్వారా తీర్చవలసిన పవన్ మొత్తంగా రాజకీయాల నుంచి పలాయనం చిత్తగించినట్లని పిస్తుంది. అప్పుడప్పుడు జనసేన అంటాడు. కొద్దిగా సందడి చేస్తాడు. మళ్ళా మాటల్లేవ్ అన్నట్లుంటాడు. అమరావతి గురించి ప్రశ్నించటానికి కూడా చాలి నంత అవగాహన లేదా పవన్ కళ్యాణ్ కు ? అందుకే బాబు ని ప్రశ్నించటం లేదా? పవన్ కు కూడా అర్థం కాని అప(ర-ర)హస్యమా!  అమరావతి?  అంతా అనుమానా స్పదమా? పివిపి, ప్రముఖ సినీ నిర్మాత తాను పవన్ కల్యాణ్ తో ఎప్పటి కి కలిసి పనిచేయ లేనని ఆయన చేతలకు మాటలకు పొంతన ఉండదని, ఆయనతో ఏమీ చేయలేమనీ,  తనకిష్టం ఉండదని" అని నిర్మొహమాటంగా ఒక చానల్ ఇంటర్వ్యూ లో అన్నారు.   ఆయన  అన్నట్లు నమ్మలేని మనిషా? ఏమో?  ఆంధ్రులు మళ్ళా మోసపోతున్నారా? ఒకసారి మోసపోతే పొరపాటు…. మలిసారి మోసపోతే గ్రహపాటు…. మళ్ళీమళ్ళీ మోసపోతూ ఉంటే అలవాటు అంటారు పెద్దలు.  అలవాటైనట్లేనా మోసపోవటం? ఇది మాకు మామూలే లే అంటు న్నారు అనుభవజ్ఞులు.     


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: