ప్రతిపక్ష నాయకురాలు రోజా అయివుంటే?


అమరావతి  పేరు తో జరిగేది  స్థిరాస్థి  వ్యాపారం. అమరావతి నిర్మాణమే ఒక ఫార్స్ వ్యవహారం. విభజన జరగక పోయుంటే చంద్రబాబు చిరునామా లేకుండా పోయుండేవారు. ఆంధ్ర కాంగ్రెస్ ఎం.పి ల స్వార్ధ పూరిత స్వప్రయోజనాలు మినహా రాష్ట్రాభివృద్ది పట్టని వారి చేతకాని తనం అలాగే తెలంగాణా ఎం.పి ల అప్రయోజకత్వం, చంద్రబాబు విభజనకు సమ్మతి తెలుపుతూ సోనియాకు ఇచ్చిన లేఖ భాషా ప్రయుక్త సమ్యుక్త ఆంధ్ర ప్రదెస్ ను నిర్దయగా విభజన పార్లమెంట్ తలుపులు మూసి మరీ జరిపించారు సొనియాగాంధి మాతృత్వాన్ని మరచి సవతి తల్లి పాత్రపోషించారు. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ లో చిరునామా లేకుండా, తెలంగాణాలో నామమాత్రావసిస్టంగా అవశేష కాంగ్రెస్ అయింది. రెండురాష్ట్రాల్లోను కాంగ్రెస్ నెత్తి నోరు భదుకున్న తిరిగి బ్రతకలేని దుస్థితికి దిగజారింది.


 

ఇలాంటి పరిస్థితికి లేఖ ఇచ్చి ఆజ్యం పోసిన బాబు ఆంధ్ర ప్రదెశ్ కు పెద్ద దిక్కులా పోజ్ పెడుతూ తనపై మచ్చ పడని రీతిలో తప్పంతా కాంగ్రెస్ పై తోసేసి జనం దృష్టి నుండి తప్పించుకున్నారు. విశ్వనగరాన్ని నిర్మిస్తానని విభజన జరుగుతున్న క్రమంలోనే గొప్పగా  లక్షల కోట్ల ప్రజాధనం మాయం చేసే ప్రణాళికా రచన చేశేసారు. దీనిని కొందరు చాణక్యమనుకున్నా నిజంగా ఇదైతే రాక్షసం. 


అమాత్య రాక్షస


 

చాణక్యమెప్పుడూ దేశ, జన ప్రయోజనాలు మరువదు. చానక్యం ఎప్పుడూ ప్రజా ప్రయొజనాల అనుకూలతనే ప్రతిబింబించే ఆలోచన. రాక్షసం మాత్రమే రాజుగారి ప్రయోజనాలే పరమావదిగా బాసించే ప్రతికూల ఆలోచన. చురుకుగా వున్నంతకాలం నవనందుల శ్రేయస్సు కోసం  జీవించి దేశ సౌభాగ్యాన్ని హితాన్ని బలిపెట్టాడు. ఇక్కడ కూడా చాణక్యుడు తన కౌటిల్యంతో రాక్షసునిలోని పరిపాలనా పరమైన విసిష్టలను వినియోగించుకోవటానికి రాక్షసుని మనసుని గెలిచి దేశమే ముఖ్యం వ్యక్తులు కాదని నిరూపించాడు.  చంద్రబాబుని అందరూ అపర చాణక్యుడు అంటారు. అది తప్పు చంద్రబాబు అపర రాక్షసమంత్రి.

 



సకల అవలక్షణ సమన్వితుడుగా వైసిపి నుండి వెళ్ళి టిడిపి లో చేరిపోతున్న ఎం.ఎల్.ఏ లచే చెప్పబడుతున్న జగన్ ఆనాడు అవినీతి ఆశ్రితపక్షపాతం కేసుల్లో ఈతకొడుతున్నాడు. ఆయన వైఎసార్ మరణం నుంచి ఉద్భవించిన ప్రభంజనముద్వారా నిలబడ్డా జనమోదం పొందని నాయకుడుగా మిగిలాడు. ఒక రకంగా ప్రజలకు తెలిసిన జగన్ బలహీనతలే చంద్రబాబు విజయాలకు సోఫానాలూయ్యాయి. పతిపక్ష నాయకుడుగా అవినీతి ముద్ర పడ్డ జగన్ వలననే చంద్రబాబు అధికారంలో కొనసాగుతున్నాడు. అందుకు టిడిపి సంబందీకులు, సభ్యులు అంతా సకుటుంబ సపరివార సమేతంగా జగన్ కు ఆజన్మాంతము ఋణపడి ఉండాలి.

 

విశ్వనగర నిర్మాణములో తాను అనుసరిస్తున్న సైబరాబాద్ అనుభవంలోని భూ కుంభకోణాలు, విపరీత కుల పిచ్చి కోణం, రాజధానిగా ఎన్నుకున్న ప్రాంతము వెనుకనున్న రాక్షసతంత్రం, తెలంగాణాలో బయటబడ్డ ఓటు కు నోటు, అమరావతి ప్రాంతంలో వెలుగు చూసిన కాల్-మని ప్రేరేపిత లైంగిక హింసాత్మక కోణం, వనితలపై జరిగిన జరుగుతున్న దమనకాండలు, ఇసుక, మధ్యం, ఎర్రచందనం, కల్తీ, అధికారులు & అధికారిణిలపై జరుగుతున్న దమనకాండల కోణం, వీటన్నిటిలోన, వెనుక ఉండి బయటపడుతున్న బాబు కుల జనులు, బందుజనులు, ఆశ్రితులు, అనుయాయులు - వీళ్ళని వెలికి తీసి బయటపెట్టే ఒక్క ప్రసార మాధ్యమం తోడు తీసుకుని, కనీసం రోజా లాంటి ప్రతిపక్షనాయకురాలు శాసనసభలో నోరు పారేసుకోకుండా సభ్యతతో మాట్లాడితేనే చాలు చంద్రబాబు శంకరగిరిమాణ్యాలు ఇప్పటికే పట్టుండేవారు.



 

అంతేకాదు పాపాలన్నీ కప్పిపెట్టే ఒక మూడు టివి చానళ్ళు, రెండు పత్రికలు చేసే మాయాజాలం లోని 'మాయ ' కోణం, కులకోణం తెర తొలగిస్తే మంచుతెరలు వీగిపోయి జనానికి అమరావతిలో జరిగేది నగ్నం గా కనిపిస్తుంది. అమరావతి నూటికి నూరు పాళ్ళు స్థిరాస్థి వ్యాపారమే కాకుంటే విభజన హామీలని నిలుపుకోని బిజెపి పై చంద్రబాబు పోరాడరెందుకు?


ఇక ధూషన - భూషణలా?

 


అదే జరిగితే అసలు రాజధాని నిర్మాణంలోని రాక్షసతంత్రన్ని మోడీగాని ఇతర బిజెపి నాయకులు గాని బయటపెడతారు. ఊర్కోరు. దీని ఫలితమే రాష్ట్రానికి విభజన ప్రయోజనాలు అందటంలేదు.

అభివృద్ది కోరుకునే ఆంధ్రా ప్రజలు చంద్రబాబు ని ఎందుకు అనుమానంతో చూస్తున్నారు? ఈ క్రింది కారణాలు చాలవా?

 

*సైబరాబాద్ భూ దోపిడీని పోలి ఉన్న అమరావతి భూదందా.

*చిదంబరంతో విభజనకు ముందు బాబు జరిపిన రహస్య మంతనాలు.

*సింగపూర్ మంత్రివర్యులు ఈశ్వరన్ తో జరిపిన రహస్య సమాలోచనలు. ఆ తరువాత నగర నిర్మాణము నుండి సింగపూరును తప్పించటం.

*తెలంగాణాలోని టిఆరెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రణాళిక 'ఓటు కు నోట’  తో బయటపడి రాష్త్రమే కాదు దేశమతా రచ్చ రచ్చ కావటం.

*చింతమనేనికి బదులు వనజాక్షిని శిక్షించటం లోని కులకోణం.

*మధ్యం, కల్తీ, ఇసుక, సెక్స్ తో నిండిన కాల్-మని లోని హింసకు కారణమైన తన కులజనులు శిక్షార్హులు కాదని ఆ తప్పంతా రాష్ట్రమంతటిపై రుద్దటం తనవాళ్ళని రక్షించటం.

*బోండా  ఉమ కొడుకు బరితెగించి వేగంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమైతే శిక్షించక పోవటం తన అనుయాయులపై బాబు ప్రేమను చూపిస్తున్నాయి.

 

*రావెల కిషొర్ బాబు కొడుకు నిర్వాకం తెలంగాణాలో జరిగింది కాబట్టి కొంత శిక్ష అనుభవించాడు. సాంకేతిక కారణాలు చూపి ఒక రాష్ట్ర ప్రముఖుని సహాయంతో రాజీ కుదుర్చుకొని సుశీల్ తన శీలం కాపాడు కున్నాడు. దీనికి రావెల పెద్ద నీతి పాఠం చెపుతుంటే ప్రజలు నోటితో నవ్వలెక ఇంకా దేంతోనో నవ్వారు.


మంత్రుల కొడుకులున్నారు అమ్మాయిలూ జాగ్రత్త! 



*అసలు "ఓటు కు నోటు" కార్యక్రమం ఏ.పి లో జరిగుంటే ఒక మూడు టివి చానళ్ళు, రెండు పత్రికలు బయట పడకుండా కాపాడేవి. దీంతో రాజధాని ఆకశ్మిక మార్పు తప్పి జాతికి కనీసం 10 లక్షల కోట్లు ఆదా జరిగి ధన వృధా వ్యయం తప్పి కేంద్రాన్ని అంగీకరింపచేసుకునే ఇబ్బందులు తప్పేవి.

 

చంద్ర బాబు ముఖ్యమంత్రి అవ్వటమే ఏ.పి కి పట్టిన దరిద్రం అంటారు ఇక్కడి ప్రజలు. ఇదంతా ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న వేదన. అనేకులు మాట్లాడుకునే బాధా తప్త హృదయవేదన. అందుకే ఒక బాబు జనులు లేని ప్రజా పోరం నిర్మించుకుని మోడీకి ప్రత్యక్షంగా వివరిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ కు విభజన ఫలాలుదక్కవు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: