ఏనుగు బీభత్సం..వంద ఇళ్లు ధ్వంసం..!

Edari Rama Krishna
మనిషి సాదు జంతువులను మచ్చిక చేసుకొని వాటితో ఎన్నో లాభాలు పొందుతున్నారు. ముఖ్యంగా ఆవు, మేక ఇతర కొన్ని సాదు జంతువులను మచ్చిక చేసుకొని వాటితో ఎన్నో రకాలుగా లాభం పొందుతున్నాడు. ఇక అడవిలో నివసించే ఎనుగును, సింహాన్ని, పులులు,ఎలుగు బంట్లు లాంటి జంతువులను కూడా మచ్చిక చేసుకొని సర్కాస్ లాంటి వాటిలో ఉపయోగించి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక పోతే కేరళాలో ఎక్కువ ఏనుగులను మచ్చిక చేసుకొని వాటితో జీవించే వారు చాలా మంది ఉన్నారు. మావటీలు ఎనుగును మచ్చిక చేసుకొని వారి చెప్పిన పని చేయించుకుంటారు.

ఎంతో సాదు జంతువుగా ఉండే ఏనుగు ఒక్కోసారి విద్వంసాలు చేసిన సంఘటనలు చాలా చూసాం. తాజాగా ఓ గజరాజు హఠాత్తుగా జనావాసాల్లోకి ప్రవేశించింది.. వచ్చింది వచ్చినట్లు తిన్నగా ఉంటుందా.. ఇళ్లన్నింటినీ ధ్వంసం చేసి వదిలిపెట్టింది. పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. అది అకస్మాత్తుగా జనావాసాల్లోకి చొచ్చుకురావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  చుట్టు పక్కల అటవీ ప్రాంతం ఉండటంతో ఎక్కడ నుంచి వచ్చిందో కాని మద గజం ఆగ్రహంతో రెచ్చిపోయింది.

వీధిలో ఇళ్లు కూలుస్తున్న ఏనుగు


దాదాపు వంద ఇళ్లను ఇష్ట మొచ్చినట్లుగా తన తొండంతో కూల్చి,కాలితో తొక్కి నానా రభస చేసింది. ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు,  అటవీ అధికారులు సమాచారం అందించారు. అటవీ అధికారులు ఏనుగును బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా అటవీ ప్రాంతంలో చెట్లు నరికేయడం వల్ల తగినంతగా ఆహారం లభించనప్పుడు, లేదా తప్పిపోయిన తమ పిల్లలను వెతుక్కుంటూ మాత్రమే ఏనుగులు ఇలా జనావాసాల్లోకి వస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: