లోకల్ రైల్లో మంటలు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణికులు పరుగులు

Durga Writes
ఓ ప్రయాణికుడు కారణంగా ముంబై రైలులో ప్రయాణికులు ఓ గంట సేపు ప్రాణాలను చేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే ఓ ప్రయాణికుడు ముంబైలోని వశీ రైల్వే స్టేషన్‌లో పన్వేల్‌కు వెళ్లే లోకల్ రైలుపై బ్యాగ్‌ను విసిరాడు. అది కాస్త రైలు ఇంజిన్ మీద ఉండే విద్యుత్ వైర్ల మీద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు పరుగులు పెట్టడం ప్రారంభించారు. 


అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఏ ఒక్క ప్రయాణికుడి హాని జరగకుండా తొక్కిసలాట చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదం తర్వాత ఆ బోగీని రైలు నుంచి వేరు చేసి షెడ్‌‌కు తరలించారు. 


ఈ ఘటనపై సెంట్రల్ రైల్వే ట్విట్టర్ వేదికగా స్పందించింది. సెంట్రల్ రైల్వే ఈ ఘటనపై ట్విట్ చేస్తూ.. ''గుర్తు తెలియని ప్రయాణికుడు లోకల్ రైలుకు ఉండే పాంటోగ్రాఫ్ మీద బ్యాంగ్ పడేశాడు. దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు ఏర్పడ్డాయి. దీనివల్ల రైలు రాకపోకలకు 12 నిమిషాలు అంతరాయం ఏర్పడింది.. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు రైళ్లపై ఎలాంటి బ్యాగ్‌లు, వస్తువులు తదితరాలు విసరొద్దని’’ అని ట్వీట్ చేసింది. అయితే ఈ ప్రమాదం అనుకోకుండా జరిగింద లేక కావాలనే జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.


Commuters are requested not to throw objects, bags, etc. on trains which may lead to disruption of services. @drmmumbaicr @drmpune pic.twitter.com/sLc2jEc7sB

— Central Railway (@Central_Railway) October 9, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: