తెలంగాణ నేత‌ల‌కు బీజేపీ ఆఫర్ల వ‌ల‌.... ప్యాకేజీలు ఇవే...

VUYYURU SUBHASH
తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ, అధికారమే లక్ష్యంగా  పార్టీలోకి వలసలని ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే పలువురు నేతలనీ చేర్చుకున్న బీజేపీ... ఈ నెల 18న పెద్ద ఎత్తున టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులని చేర్చుకోనుంది. ముఖ్యంగా టీడీపీ నేతలు జిల్లాలు జిల్లాలుగా బీజీపీలో చేరిపోనున్నారు. అయితే బీజేపీలోకి వచ్చే నేతలు ఏదొకటి ఆశించే పార్టీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అటు బీజేపీ కూడా పార్టీలోకి వస్తే సముచిత స్థానమ కల్పిస్తామని చెబుతుంది.


అయితే బీజేపీ ముఖ్య నాయకులు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి డీకే అరుణ, పొంగులేటి సుధారకర్ రెడ్డిలకు రాజ్యసభ ఇస్తానని హామీ ఇస్తేనే వారు బీజేపీలో చేరారు. ఇక టీఆర్ఎస్ నుండి వచ్చిన జితేందర్ రెడ్డికి అదే హామీ ఇస్తూ.. రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఆఫర్ చేశారు. తాజాగా చేరిన మాజీ ఎంపీ వివేక్ కు కూడా రాజ్యసభ ఆఫర్ చేశారు. అటు అంతకముందు టీడీపీ నుంచి వచ్చిన పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్, చాడ సురేశ్ రెడ్డిలకు కూడా పెద్ద ఆఫరే ఇచ్చినట్లు తెలుస్తోంది.


టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికిపాటి నరసింహారావు కూడా మళ్ళీ రాజ్యసభ హామీతోనే ఈ నెల 18న తన కేడర్ తో పాటు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అలాగే సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుతో కూడా బీజేపీ అగ్రనేతలు మంతనాలు జరుపుతూ...పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మరి ఆయనకు కూడా రాజ్యసభ ఆఫర్ ఇచ్చారా, లేక ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపిస్తారనేది చూడాలి. అలాగే విజయశాంతికి రాజ్యసభ, దామోదర్ రాజనర్సింహకు.. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇక వారు నిర్ణయం మీదే ఆధారపడి ఉందని తెలుస్తోంది.


మొన్నటివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళతారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీలోకి వెళితే తానే సీఎం అభ్యర్ధిని అని ముందే ప్రకటించుకున్నారు. దీంతో సీన్ రివర్స్ అయ్యి ఆయన చేరికకు బ్రేక్ పడింది.  మొత్తానికి చాలమందికి బీజేపీ ఒకే విధంగా ఆఫర్లు ఇచ్చినట్లు అర్ధమవుతుంది. మరి వారి ఆఫర్లని ఏ విధంగా అమలు పరుస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: