"అమ్మవడి"..పధకంపై మొదలైన కుట్రలు...ఇంత నీచానికి దిగజారాలా...!!!!

NCR

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మొదటి క్యాబినెట్ మీటింగ్ లో ఎన్నో కీలక అంశాలపై  ఆమోద ముద్ర పడింది.  పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలన్నిటిపై తనదైన రీతిలో స్పందిస్తున్న జగన్ మోహన్ రెడ్డి, తాజాగా జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో  నవరత్నాలలో భాగంగా ప్రవేశపెట్టిన అమ్మవడి పధకాన్ని జనవరి 26 -2020 నుంచీ ప్రారంభించాలని ఆమోదించారు. ఏపీలో ప్రవైటు స్కూల్స్ పీజుల నియంత్రణ పై ఓ కమీషన్ ఏర్పాటు కి కూడా రంగం సిద్డం చేశారు.

 

ఏపీలోని విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే విధంగా ,విద్యా వ్యవస్థలో దోపిడీ విధానానికి చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. నిన్నా మొన్నటి వరకూ ప్రవైటు విద్యాసంస్థల వల్ల దోపిడీకి గురయిన తల్లి తండ్రులకి నేనున్నాను అంటూ అమ్మవడి పధకం ద్వారా అండగా ఉండనున్నారు. గత ప్రభుత్వ తప్పిదాల్ని ప్రజలకి అర్థం అయ్యేలా ఎంతో పారదర్సకంగా విధ్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తామని తెలిపారు . ఆ ఫీజులు, ఈ ఫీజులు అంటూ తల్లి తండ్రులని పీడించుకు తింటే సహించేది లేదని స్పష్టమైన హెచ్చరికలు  జారీ చేశారు.

 

మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను తెరిచి అందులో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి. పూర్తిస్థాయిలో ఆ స్కూల్స్ లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమ్మవడి పధకం కేవలం ప్రభుత్వ పాఠశాలలలో చదివే వారికే కాదని, ప్రవైటు స్కూల్స్ లో పిల్లలని చదివిస్తున్న వారికి కూడా ఈ పధకం వర్తిస్తుందని ప్రకటించారు ఏపీ మంత్రులు. దాంతో ఎంతో మంది పిల్లల తల్లి తండ్రులు ఈ నిర్ణయంపై  హర్షం వ్యక్తం చేయగా పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని అన్నట్టుగా అప్పుడే ఈ పధకంపై సోషల్ మీడియాలో అప్పుడే కుట్రలు మొదలయ్యాయి.

 

అమ్మవడి పధకం జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసింది ప్రభుత్వ స్కూల్స్ ని మూసేయాలనే కుట్రలో భాగమే అంటూ అప్పుడే కోడి గుడ్డికి ఈకలు పీకడం మొదలు పెట్టారు. 15 వేల  రూపాలు ఇస్తే ప్రభుత్వ స్కూల్స్ కి ఎందుకు పంపుతారు,ప్రవైటు స్కూల్స్ కి వెళ్తారు కదా అంటూ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బ్రతికించు కుందాం అనే నినాదంతో త్వరలో ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో  పోస్టులు హల చల్ చేస్తున్నాయి. అయితే

 

రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పధకం ప్రారంభించినపుడు కూడా ప్రవైటు ఆసుపత్రులకి వేల కోట్లు దోచి పెట్టేస్తున్నారు, ప్రభుత్వ ఆసుపత్రులని మూతబడే విధంగా, ప్రవైటు ఆసుపత్రులకి లబ్ది చేకూర్చుతున్నారు,  అంటూ ఎన్నో ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు అదే ఆరోగ్య శ్రీ పధకం అన్ని రాష్ట్రాలకి ఆదర్శవంతమైన పధకంగా మారింది. ఎంతో మంది పేద వారికి కార్పోరేట్ ఆసుపత్రులలో సైతం వైద్యం అందేలా ఈ పధకం రూప కల్పన జరిగింది. ఇప్పుడు జగన్ ప్రవేశ పెట్టిన అమ్మవడి పధకం, ఆర్ధిక పరిస్తితితులతో కొట్టి మిట్టాడుతున్న ఎంతో మంది తల్లి తండ్రులకి చేయూత నిస్తుందని అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాలు ఎన్నో రాష్ట్రాలకి ఆదర్శంగా నిలుస్తాయని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అమ్మవడి పధకం ప్రజల మనసు చొరగొంటుందని  ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: