సారీ.. ఇప్పుడు కుదరదు.. రేవంత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్టు?

Chakravarthi Kalyan
తెలంగాణలో పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారణ చేసింది. ఎస్సీ ఎస్టీ జనాభా లేని ప్రాంతాల్లో కూడా ఆ కులాలకు సర్పంచ్ వార్డు మెంబర్ పదవులు రిజర్వు చేయడం సరికాదని పిటిషనర్లు వాదించారు. రెండు వేల పదకొండి జనాభా గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించడం వల్ల అనేక తప్పిదాలు జరిగాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరారు.ధర్మాసనం అయితే చట్టపరంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్లలో ఎలాంటి జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని పేర్కొంది. రిజర్వు చేసిన చోట సంబంధిత కులాలకు చెందిన అభ్యర్థులు లేకపోతే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తమ వాదనలో తెలిపింది. ఈ వాదనను ధర్మాసనం రికార్డు చేసుకుంది.పిటిషన్లపై వాదనలు పూర్తయిన తర్వాత హైకోర్టు విచారణను ముగించింది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

ఈ తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఊరట కలిగించింది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ కొనసాగే అవకాశం ఏర్పడింది.ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రిజర్వేషన్ల అమలులో ఎదురైన అడ్డంకులు తొలగాయి. ఎన్నికల సంఘం సూచనలు అమలు చేస్తూ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనుంది. రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎన్నికల సన్నాహాలపై దృష్టి పెట్టనున్నాయి. గ్రామీణ స్థాయి పాలనలో మార్పు తీసుకురావడానికి ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.

 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌ జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: