పేదల కలలు నిజం చేయబోయే కూటమి బ్రహ్మాస్త్రం ఇదే..!

Amruth kumar
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం సంక్షేమ ధోరణిని మరింత బలపరిచింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం, సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది. ఎన్నికల హామీలను ఒకటొక్కటిగా అమలు చేస్తూ, నమ్మకాన్ని నిలబెట్టుకుంటోంది. ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పధకాలతో లక్షలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చింది. ఇప్పుడు ఈ క్రమంలో "ఇల్లు లేని వారికి ఇంటి స్థలం" అనే శాశ్వత సంక్షేమ పధకాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ పధకం ప్రత్యేకత ఏమిటంటే ... ఇది ఒకసారి ఇవ్వబడితే జీవితాంతం లాభం చేకూరే విధంగా ఉంది.


ఇక ఇతర పధకాలు తాత్కాలికంగా రానురాను రూపాన్ని మార్చుకోగలవు కానీ, ఈ పధకం ప్రజల జీవితాల్లో స్థిరమైన మార్పును తీసుకురానుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్థలాలను ఇచ్చి, అర్హులైనవారికి ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించనుంది. ఈ పధకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జూలై 19 నుంచి మొద‌లు కానున్న‌యి. అర్హులైన లబ్ధిదారులు తమ ఆధార్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో తీసుకొని గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేయవచ్చు. సచివాలయ ఉద్యోగుల సహాయంతో ఈ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలి. అటుపై ప్రభుత్వం విచారణ చేసి అర్హులైన వారికి పట్టాలను మంజూరు చేయనుంది. గత ప్రభుత్వ కాలం అంటే వైసీపీ హయాంలో సెంటు స్థలంతోనే ఇళ్ల స్థలాలు ఇచ్చారు.


కానీ అందులో చాలామంది ఇల్లు నిర్మించలేకపోయారు. ఇప్పుడు కొత్తగా స్థలాల సైజు పెరిగిన నేపథ్యంలో, అప్పట్లో స్థలం పొందినవారికి కూడా కొత్తగా ఈ అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే గతంలో స్థలం తీసుకున్నవారు కూడా ఇప్పుడు ఇంటి నిర్మాణం కోసం అర్హత పొందే అవకాశం ఉంది. ఇదే కాకుండా, 2014-2019 మధ్య టిడ్కో ఇళ్ల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కూడా ఇప్పుడు తిరిగి ప్రోత్సహించనున్నారు. అప్పట్లో నిర్మాణం ప్రారంభమైన టిడ్కో ఇళ్లను పూర్తిచేసి, 2026 సంక్రాంతి నాటికి పెద్ద ఎత్తున లబ్ధిదారులకు అప్పగించాలనే ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలతో పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇల్లు అనే కల ఇప్పుడు హక్కుగా మారే దశకు వచ్చింది. ప్రభుత్వ సంకల్పం సఫలమైతే, లక్షల మంది పేద ప్రజలు తమ స్థిర నివాస కలను నెరవేర్చుకోనున్నారు. ఇలా చూస్తే... ఏపీలో నిజంగానే 'ఇళ్ళ పండుగ'కు కూటమి ప్రభుత్వం సమగ్రంగా రంగం సిద్ధం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: