ఈసారి భారతరత్న దక్కేది ఎవరికి .. రేసులో ముందుంది ఆ ఇద్దరే..!

Amruth kumar
ఈ రిపబ్లిక్ డే కి భారత అత్యున్నత పౌర పురుష్కారం భారతరత్నను ఎవరికి ప్రకటిస్తారన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తుంది .. ఎప్పటిలాగానే పలువురు రాజకీయ నాయకులకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది .. ఇక మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా భారతరత్న రేసులో ఉన్నట్టు తెలుస్తుంది .. గణతంత్ర దినోత్సవం వేళ త్వరలోనే భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది .. ఇక‌ ఇప్పుడు ఈ భారతరత్న పురస్కారం రేస్ లో ఉన్న భారతీయ ప్రముఖుల వివరాలను ఇక్కడ చూద్దాం.


ఇక భారతరత్న పురస్కార రేసులో ప్రముఖ దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పేరులు ముందు వరసలో ఉన్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం .. ఇక గత ఏడాది అక్టోబర్ లో రతన్ టాటా చనిపోయారు .. ఇక ఇప్పటినుంచి ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ అందరిలో ఉంది .. ఆయన మరణం తర్వాత ఈ డిమాండ్ మరింత బలపడింది .. ఇక రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ మహారాష్ట్ర గవర్నమెంట్ తీర్మానం కూడా చేసింది.


అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గత ఏడాది డిసెంబర్ 26న మరణించారు. . ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీతో పాటు కొందరు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి .. మన్మోహన్ సింగ్ కు ఢిల్లీలో స్మృతి స్థల్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది .. దీనితోపాటు మన్మోహన్ సింగ్ భారతరత్న ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఢిల్లీ వర్గాలు కూడా చెబుతున్నాయి . కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 2019లో మోడీ సర్కార్ భారతరత్న ఇచ్చారు .. 2024లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఈ భారత అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు.


అంతేకాకుండా ఈ భారతరత్న రేస్ లో ఎన్టీఆర్ కూడా ఉన్నారు .. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని టిడిపి బలంగా వినిపిస్తుంది .. ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేశారు .. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వంలో టిడిపి కీలికంగా ఉంది .. ఇక దీంతో ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించేందుకు టిడిపి నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది .


అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం మూడు లేదా నలుగురికి భారతరత్న ప్రకటించే అవకాశం ఉన్నట్టు పలు వార్తలు బయటకు వస్తున్నాయి .. గణతంత్ర దినోత్సవం ముందు లేదా ఆ తర్వాత వీటికి సంబంధించిన అధికార ప్రకటనను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది .. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు ఉండటంతో ఎన్నికల తర్వాతే భారతరత్న పురస్కారాలను ప్రకటించి అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు . ఈ 2025 రిపబ్లిక్ డే మోదీ ప్రభుత్వం ఎంతమందికి భారత అత్యున్నత పురస్కారం ప్రకటిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: