ఏపీ: భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సైతం ఏపీ ప్రభుత్వం పెంచినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అయిన అనగాని సత్య ప్రకాష్ ఈ విషయాన్ని సైతం తెలియజేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయి అంటూ ఇటీవలే ఒక ప్రకటనను కూడా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాలలో భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎంత పెంచాలి ఎక్కడ తగ్గించాలి అనే విషయం పైన కూడా త్వరలోనే పూర్తి నివేదిక జనవరి 15వ తేదీ లోపు అందించబోతున్నామంటూ  తెలియజేశారు.

తాడేపల్లి ఐజి ఆఫీసులో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అయినటువంటి అనగానే సత్యప్రసాద్ మీటింగ్ లో తెలియజేశారు. రాష్ట్రానికి కూడా రెవెన్యూ చాలా అవసరమని ఈ నేపద్యంలోనే భూముల రిజిస్ట్రేషన్ విలువలను కూడా పెంచాలనుకున్నట్లుగా తెలియజేశారు. అయితే ఎక్కడ భూమి రేట్లు బాగా పెరుగుతున్నాయో అక్కడ రిజిస్ట్రేషన్ విలువలు కూడా పెరగబోతున్నట్లు తెలియజేశారు. గత ప్రభుత్వం చేపట్టిన రిజిస్ట్రేషన్ విలువలు పెంపు శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని చాలా ప్రాంతాలలో భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ వ్యాల్యూ  ఎక్కువగా ఉందని తెలిపారు. ఇలా అన్నిటిని కూడా ఇప్పుడు సరిచేస్తున్నామంటూ వెల్లడించారు మంత్రి అనగానే సత్య ప్రకాష్.

భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరిగిన చోట 15 నుంచి 20% వరకు చార్జీలు పెంచబోతున్నట్లు తెలిపారు మంత్రి. చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాలను భూముల రిజిస్ట్రేషన్ విలువలను కూడా తగ్గించబోతున్నట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం నరసరావుపేటలో 12 లక్షలు ఉన్నటువంటి భూమి 1.8 కోట్లకు చేరింది అంటూ వెల్లడించారు. ఇలా రాష్ట్రంలో 10 జిల్లాల నుంచి 50 నుంచి 60 అభ్యంతరాలు కూడా రావడంతో కమిటీ సిఫార్సులు, గ్రోత్ కారిడార్ల అద్వైయాయంలోనే ఈ రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు విధానంలో 200 మంది డిజిటల్ అసిస్టెంట్లను కూడా ఉపయోగించబోతున్నట్లు తెలిపారు. వీటివల్ల ప్రతి ఏడాది రెవెన్యూ శాఖ నుంచి 6200 కోట్లు ఆదాయం ఉంటుంది అంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: