వైసీపీలోకి ఏపీ టాప్ లీడర్.. చేరిన వెంటనే ఎమ్మెల్యే టిక్కెట్ కూడా..?
శైలజనాథ్ సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా కీలకపాత్ర పోషించారు. ఏపీ కాంగ్రెస్కు షర్మిల నాయకత్వం పెద్దగా ఉపయోగం లేదు. ఆమె ఆ పదవిలో కొనసాగితే కాంగ్రెస్ మరింత బలహీనమవుతుందని భావించిన ఆయన వైసీపీలో చేరడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తు మెరుగుపరుచుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శైలజనాథ్ గతంలో టిడిపిలో చేరతారని చాలా సార్లు వార్తలు వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో టిడిపి బీఫామ్ ఇచ్చిన జిల్లా పార్టీ పెద్దల వివాదాల కారణంగా చివరి నిమిషంలో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మంత్రిగా పనిచేయడంతో నియోజకవర్గంలోనూ ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ప్రస్తుతం సింగనమల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి .. ఆమె భర్త రాజకీయాల కంటే వ్యక్తిగత వ్యవహారాలపై దృష్టి పెట్టడంతో కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో శైలజానాథ్ పార్టీలో చేరితే వెంటనే సింగనమల నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి పగ్గాలు అప్పగించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన అనుభవాన్ని వాడుకోవాలని వైసిపి అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేపటి వేళ పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక సమీకరణలు .. సీనియారిటీ కోటలో ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చి అవకాశం ఉందంటున్నారు.