నాగ‌బాబుకే కాదు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి.. మ‌రి కేబినెట్ నుంచి అవుట్ ఎవ‌రు ?

RAMAKRISHNA S.S.

- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో చోటు ఖాయం అయింది. త్వరలోనే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకు ఏ ఏ శాఖలు ఇస్తారు అన్న చర్చలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో టిడిపి నేత పేరు కూడా క్యాబినెట్ లోకి వినిపిస్తోంది. వాస్తవానికి మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకుండా 25 మంది మంత్రులు ఉంటారు. ఇప్పటికి 24 మంది మంత్రులు ఉన్నారు .. ఒక సీటు ఖాళీగా ఉంది .. దానిని జనసేన నాయకుడు నాగబాబుతో భర్తీ చేస్తున్నారు. దీంతో మంత్రివర్గం మొత్తం పూర్తిగా ఏర్పడినట్టు అవుతుంది. అయితే ఏపీ టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కనుందని టిడిపి వర్గాల లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఆయనను కూడా నాగబాబుతో పార్టీ మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. పార్టీ పరంగా చూపించిన దూకుడు అందర్నీ కలుపుకుపోతున్న విధానం .. సభ్యత్వ నమోదులో సాధించిన రికార్డు నేపథ్యంలో బీసీల్లో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్న పల్లాకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా పార్టీ పరంగా మరింత జోష్ పెంచేందుకు అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.

మంత్రి పదవి ఇచ్చే విషయంలో మంత్రి నారా లోకేష్ కూడా చంద్రబాబు కు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. పల్లా వంటి సానుకూల దృక్పథం ఉన్న నాయకుడిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు చంద్రబాబు - లోకేష్ ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన క్యాబినెట్ ఎంట్రీ దాదాపు ఖాయం అయినట్టే అంటున్నారు. మరి నాగబాబుతో పాటు పల్లా శ్రీనివాస్ కూడా క్యాబినెట్ లోకి వస్తే కచ్చితంగా క్యాబినెట్ నుంచి ఒక మంత్రి ని తప్పించాలి. ఇప్పుడున్న మంత్రులు ఒకరు ఇద్దరిని పక్కనపెట్టి వారి స్థానంలో పల్లా తో పాటు మరో కీలక నాయకుడు కూడా అవకాశం ఇవ్వనన్నట్టు సమాచారం. రాజకీయంగా దూకుడు పెంచేందుకు చంద్రబాబు ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రచారం తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: