ఏపీ టీడీపి:పార్టీలో ఉండాలా..వద్దా.. టిడిపి నేత హాట్ కామెంట్స్ ..!

Divya
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బుద్ధా వెంకన్న ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్ తో టిడిపి నేతలు ర్యాలీ చేయడం చాలా బాధాకరంగా ఉందని.. వైసీపీ నేతలతో టీడీపీ నేతలే కలిసి ఉంటే తామే పోరాటాలు చేస్తున్నప్పటికీ ఎలా అంటే ఫలితం ఉంటుంది అంటూ ప్రశ్నించారు.. దీనిపై అధిష్టానం స్పందించినప్పటికీ తమకు మార్గదర్శకాలు చేయాలని కూడా కోరారని గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి పైకి దాడికి వెళ్ళిన జోగి రమేష్ ను తాము అడ్డుకుంటున్న సమయంలో తీసిన కొన్ని ఫోటోలను సైతం టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుద్ధ వెంకన్న ప్రదర్శించడం జరిగింది.
చంద్రబాబు ఇంటి పైకి వెళ్లిన వైసీపీ నేత జోగి రమేష్ చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారని.. సీఎం చంద్రబాబుకు బాధ కలిగించినటువంటి వారితో టీడీపీ నేతలు ఉండడం ర్యాలీ చేయడం చాలా బాధ కలిగించింది అంటూ తెలియజేశారు టిడిపి కార్యదర్శి  బుద్ధా వెంకన్న.. జోగి రమేష్ తో టిడిపి నేతలు పంచుకున్నటువంటి ఫోటోలు చూసి చంద్రబాబు గుండె మీద తన్నిన విధంగా ఉందంటూ తెలియజేశారు.

తమ నాయకులను తాము ఏమి అనలేకపోతున్నామని కొన్ని సందర్భాలలో పార్టీలో ఉండాల వద్దా అనిపిస్తుంది అంటూ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి బుద్దా వెంకన్న ఆవేదనను సైతం తెలియజేస్తున్నారు. జోగి రమేష్ ని టిడిపి నేతలు దూరంగా ఉంచాలని తెలిపారు. చంద్రబాబు ఇంటి వద్ద తాను అడ్డుకోవడంతో పోలీసులు తమ పైన దాడి చేశారని కూడా తెలిపారు.. 23 స్థానాల నుంచి మళ్లీ ఇంతటి భారీ విజయం అందుకున్నాము అంటే అది కేవలం చంద్రబాబు వల్లే సాధ్యమైందని.. అందరము కూడా ఆయన అడుగుజాడల్లో నడిచే పనిచేయాలని.. చంద్రబాబు పైన అభిమానంతోనే తాము ఎన్నో పోరాటాలు చేశామని తెలియజేశారు. జోగి రమేష్ వంటి నేతలను అసలు టిడిపిలో రానివ్వకూడదు అంటూ బుద్ధ వెంకన్న ఆవేదనను తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: