"ఇకపై మేం కూడా అలా చేయము".. స్టార్ హీరోయిన్స్ కొత్త కండీషన్స్ తో మేకర్స్ హడల్..!?

Thota Jaya Madhuri
ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం బయటకు రావాలి అన్నా.. సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడాలి అన్నా.. స్టార్స్ వణికి పోతున్నారు . భయంతో గజగజ షివర్ అయిపోతున్నారు . దానికి కారణం మనకు తెలిసిందే . పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ అరెస్ట్ కావడమే. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ కోసం  బాగా కష్టపడ్డాడు . అనుకున్న రీతిలోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే అనుకున్న దానిమీద కూసింత ఎక్కువగానే సక్సెస్ అయింది . ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఏ మూవీ కలెక్ట్ చేయన్నని కోట్లు కలెక్షన్స్ కలెక్ట్ చేసి అతి తక్కువ టైంలోనే 1000కోట్ల క్లబ్లో చేరిన మొట్టమొదటి తెలుగు సినిమాగా ఇండియాలో బిగ్ రికార్డ్ క్రియేట్ చేసింది .


అయితే అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం అందరికీ షాకింగ్ గా అనిపించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది . అల్లు అర్జున్ వల్లే ఆ ప్రమాదం జరిగింది అంటూ పోలీసులు ఆరోపిస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు . ఆ తర్వాత బన్ని తన టాలెంట్ తో..అదే విధంగా పలుకుబడి అంతా ఉపయోగించి మధ్యంతర బెయిల్ తో బయటకు వచ్చారు. అయితే బెయిల్ కాన్సిల్ చెయ్యాలి అంటూ పోలీసులు హైయర్ అఫీషియల్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నారు .


కాగా ఇప్పుడు ఈ ఇష్యూ కారణంగా హీరోయిన్స్ తమ సినిమా ప్రమోషన్స్ కు రావాలి అంటేనే భయపడిపోతున్నారు. మేకర్స్ సరైన సెక్యూరిటీ అదేవిధంగా ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వదు.. ఎటువంటి ఇష్యూస్ రావు అని హామీ ఇస్తేనే మేము సినిమా ప్రమోషన్స్ కి వస్తాము అంటూ హీరోయిన్స్ బల్లగుద్ది మరి చెబుతున్నారట . ఒకప్పుడు హీరోయిన్స్ సినిమా ప్రమోషన్స్ చురుగ్గా పాల్గొనేవారు . కానీ అల్లు అర్జున్ అరెస్టు తర్వాత హీరోయిన్స్ పై భయడిపోతున్నారు. హీరోయిన్స్ చూడడానికి జనాలు ఎగబడిపోతారు . సంధ్య థియేటర్లో జరిగినట్టే బయట కూడా జరిగితే ఎవరూ రెస్పాన్సిబిలిటీ ..? అంటూ హీరోయిన్స్ మేకర్స్ పై చాలా చాలా ప్రెసెర్ తీసుకొస్తున్నారట . పూర్తి సెక్యూరిటీ ఇస్తేనే సినిమా ప్రమోషన్స్ కి అటెండ్ అవుతాం అంటూ చాలామంది మేకర్స్ తో హీరోయిన్స్ వాదిస్తున్నారట..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: