ఆ టీమ్ ఇండియా క్రికెటర్.. ఇప్పుడు మగాడిగా మారుతున్నాడు.. గవాస్కర్ కామెంట్స్ వైరల్?
విషయం ఏమిటంటే... పెర్త్, అడిలైడ్ టెస్ట్‌లో ఆసీస్‌ను కంగారు పెట్టిన నితీష్ రెడ్డి.. గబ్బా టెస్ట్‌లో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుండడం విశేషమనే చెప్పుకోవాలి. మొదటి ఇన్నింగ్స్‌లో అయితే స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను భయబ్రాంతులకు గురి చేసి మరీ ఔట్ చేశాడు. 55 బంతుల్లో 12 పరుగులు చేసిన ఆసీస్ బ్యాటర్.. తెలుగోడి బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే మహ్మద్ సిరాజ్ సహా ఇతర బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో పరుగులు చేయడంలో మార్నస్ లబుషేన్ నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో బౌలింగ్‌కు దిగిన నితీష్.. డాట్ బాల్స్‌తో టెన్షన్ పెట్టాడు. ఆ తర్వాత ఔట్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్స్‌లో ఊరించే బంతులతో అతడ్ని రెచ్చగొట్టడంతో ట్రాప్ లో పడిన లబుషేన్.. వదిలేయాల్సిన బాల్‌ను షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్లిప్స్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
ఈ క్రమంలోనే నితీష్ ని క్రికెట్ దిగ్గజం గవాస్కర్ ఆకాశానికెత్తేసాడు. నితీష్ కుమార్ రెడ్డి ముఖ్యంగా మూడవ టెస్టులో కనబరిచిన ఆటతీరుని ప్రశంసిస్తూ... పొగడ్తల వర్షం కురిపించాడు. 22 ఏళ్ల నితీష్ కుమార్ మగాడిగా మారుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసాడు. దాంతో ఈ వ్యాఖలు ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఇలా అపుడపుడు రివ్యూలు చెబుతూ టాక్ అఫ్ ది టౌన్ గా మారతాడు. ఒక్కోసారి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతాయి కూడా. ఆమధ్య ఓ క్రీడాకారుడు గవాస్కర్ వ్యాఖ్యలను ఎవరు పట్టించుకొంటారని కూడా సెటైర్ వేసిన సందర్భం ఒకటి ఉంది. గతసారి ఓ పత్రికకు సునీల్ గవాస్కర్ రాసిన వ్యాసంలో ఆస్ట్రేలియా టీమ్ కు భయం పట్టుకుంది.. అందుకే కొందరు సీనియర్లపై వేటు వేసిందని పేర్కొన్నారు. దాంతో సదరు టీమ్ ఆటగాళ్లు గవాస్కర్ ని ఉద్దేశిస్తూ పై మాటలు అనడం జరిగింది.