చంద్రబాబుపై పెద్ద ప్లానే వేసిన విజయ సాయి రెడ్డి?

Chakravarthi Kalyan

తనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబు, కేవీ రావు, నారా లోకేష్ లపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.  వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే చంద్రబాబు జైలు పాలవ్వడం తథ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కాకినాడ పోర్టు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగ అయింది. బియ్యం అక్రమ రవాణా, సీజ్ ది షిప్ దగ్గర మొదలైన వ్యవహరం ఇప్పుడు కాకినాడ పోర్టులో బెదిరించి షేర్లు తక్కువ రేటుకు రాయించుకున్నారంటూ సీఐడీకి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది.


కాకినాడ పోర్టు యాజమాన్యాన్ని తమ బంధువులకు ఇప్పించుకునేందుకు విజయసాయిరెడ్డి తనను బెదిరించి షేర్లు తక్కువ రేట్లకు లాక్కున్నారంటూ మాజీ ఛైర్మన్ కేవీ రావు తాజాగా సీఐడీకి ఫిర్యాదు చేశారు.  దీనిపై స్పందించిన సీఐడీ సాయిరెడ్డిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. అసలు ప్రభుత్వ రంగంలోని పోర్టు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎళా వెళ్లింది అంటూ.. పుట్టుపూర్వత్రాలు బయటకు తీసే ప్రయత్నం చేశారు.  జగన్ పై కక్ష తీర్చుకోవాలనే ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.


సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిజంగా అన్యాయం జరిగితే నాలుగున్నరేళ్లుగా కేవీ రావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.   చంద్రబాబుకి పాలన చేతకాదని.. లోకేష్ కూడా అడ్మినిస్ట్రేటర్ కాదని.. తండ్రీ కొడుకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.  


వాస్తవానికి గత ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయ్యే స్థాయిలో ఓటమి పాలవ్వడానికి గల కారణాల్లో చంద్రబాబుని అరెస్ట్ చేయడం ఒకటనే చర్చ బలంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వయసులో చంద్రబాబుని సెంట్రల్ జైలుకి పంపడం వైసీపీ సర్కార్ చేసుకున్న రాజకీయ ఆత్మహత్యా ప్రయత్నం అనే విశ్లేషణలూ తెరపైకి వచ్చాయి. అయితే... తాము మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబును అరెస్ట్ చేయడం కన్ ఫాం అంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: