ఏపీ: జగన్ పిలుపుకి స్పందన లేదా..?
అయితే వీటిని కార్యకర్తలు రీట్వీట్ కానీ వైరల్ గా కానీ ఎక్కడ చేయడం లేదు.. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కార్యకర్తలు సైతం అరెస్టు అయ్యి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది భయపడి కూటమి ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకంగా పోస్టులను కూడా షేర్ చేయలేదు... అయితే ఈ విషయంపై మాజీ సీఎం జగన్ కూడా తాను చేసిన ట్వీట్లను రి ట్వీట్ చేయమని సలహా కూడా ఇచ్చారు.. అయినప్పటికీ కూడా ఈ విషయంపై ఎవరు ఎక్కడ ఏ కార్యకర్త కూడా స్పందించలేదట.. పార్టీ తరఫున అన్నిటిని పోస్ట్ చేయండి అంటూ నేతలకు సైతం సూచించారు జగన్.. అయితే ఆ ధైర్యం మాత్రం ఇంకా కార్యకర్తలకు రాలేదట.
ఇప్పటికే చాలామంది కార్యకర్తలు కూడా అరెస్టు అయ్యారనే ఫీల్ అవుతున్నట్లుగా కనిపిస్తోందట.. గతంలో ఎలాంటి ట్వీట్ చేసినా కూడా లక్షలకు లక్షల మంది రిట్వీట్ చేస్తూ ఉండేవారు.. కానీ ఇప్పుడు స్పందన కరువైందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. జగన్ రైజ్ చేస్తున్నటువంటివి చాలా కీలకమైన అంశాలు.. అలాంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందట.. ముఖ్యంగా జగన్ క్యాడర్లో నమ్మకం పెంచుకోవడం అన్నటువంటి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది.. అసలు విషయాన్నయితే గ్రహించారు కాబట్టే.. జనవరి నుంచి కార్యకర్తలతో కలిసే ప్రయత్నాలను చేస్తున్నారు.. ఇది సక్సెస్ అయ్యేవరకు వైసీపీ నేతలకు ఇది కాస్త సందీప్త అని చెప్పవచ్చు.