కృత్రిమ వర్షం అంటే ఏమిటి.. ఢిల్లీలో ఇలాంటి వర్షంతో కాలుష్యం తగ్గుతుందా?
ఎంతలా అంటే మిగతా రాష్ట్రాలలో పండుగలు వచ్చినప్పుడు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం చూస్తూ ఉంటాం. కానీ ఢిల్లీలో మాత్రం కాలుష్యం పెరిగినప్పుడల్లా స్కూల్స్ కాలేజీలకు సెలవులు ప్రకటిస్తూ ఉంటుంది అక్కడి ప్రభుత్వం. దీన్నిబట్టి అక్కడ కాలుష్య తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యపు ఉచ్చులో పడి ఎక్కడ ప్రాణాలు కోల్పోతామో అని ఢిల్లీ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత తగ్గాలంటే గాలి నాణ్యత మెరుగుపడాలంటే కృత్రిమ వర్షం కురిపించాలని మంత్రి గోపాల్ కేంద్రాన్ని ఇటీవల కోరడం చర్చనీయాంశంగా మారింది.
కృత్రిమ వర్షం వల్ల అటు కాలుష్యం తగ్గే అవకాశం ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీనివల్ల దుమ్ము దూళి రేణువులు వర్షపు బిందువులతో కలిసి భూమిని చేరుతాయి దీంతో కాలుష్యం కొంత తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. కాగా 1438 చదరపు మీటర్ల విస్తీర్ణం లో ఉన్న ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించడం అంత సులభమైన విషయం కాదు అంటూ మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
కృత్రిమ వర్షం అంటే ఏంటంటే : మేఘాల్లో సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి కెమికల్స్ చల్లి వర్షం కురిపించడమే కృత్రిమ వర్షం లేదా క్లౌడ్ సీడింగ్ అని అంటారు. తేమతో ఉన్న మేఘాలు, గాలివాటం సరైన స్థితిలో ఉంటేనే ఇది వీలవుతుంది. కాగా ఇందులో స్టాటిక్,డైనమిక్ రకాలు ఉండగా ఈ కృత్రిమ వర్షం కురిపించాలంటే ముందుగా కేంద్రం అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది.