పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన పాట ఏంటో తెలుసా.. ఎవరు ఊహించి ఉండరు..?

Divya
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడికి వెళ్లి బిజెపి పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ మరాఠీలో ప్రసంగించి అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. మొదటిసారి జై భవాని.
 జై శివాని..జై మహారాష్ట్ర అంటూ ప్రసంగంతో మొదలుపెట్టారట. తాను మరాఠీలో మాట్లాడుతున్నప్పుడు ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలి అంటూ తెలియజేశారు. ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ కొత్త విషయాలను తెలియజేస్తూ తనకు ఇష్టమైన పాటను కూడా తెలియజేశారు.

తెలంగాణ గురించి మాట్లాడుతూ తెలంగాణ అంటే పోరాటాల గడ్డ అని తెలంగాణ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని.."బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి" అనే పాట తనకు చాలా ఇష్టమైన పాట అని తెలియజేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది అంటూ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇష్టమైన పాట ఎట్టకేలకు తన నోటి నుంచి రావడంతో అభిమానులు ఈ విషయం విన్న తర్వాత ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా స్టార్ హీరోలు కానీ సెలబ్రిటీలు కానీ తమ సినిమాలను ఇష్టమైన పాటని చెబుతూ ఉంటారు కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో మాట్లాడుతూ తాను ఇక్కడికి ఓట్లు అడగడానికి రాలేదని మరాఠీ వీరులకు నివాళులు అర్పించడానికి వచ్చానని తెలియజేశారు.. మరాఠీ యోధుల గురించి వారి పోరాటం గురించి మరొకసారి గుర్తు చేస్తున్నానని తెలిపారు. ఇక్కడ శివాజీ మహారాజ పరిపాలన సైతం గుర్తు చేస్తున్నానని తెలియజేశారు. వీరే కాకుండా ఎంతోమంది వీరత్వం కలిగిన ఈ గడ్డ మహారాష్ట్ర అంటూ తెలియజేశారు. మరి పవన్ కళ్యాణ్ వాక్యాలు మహారాష్ట్ర బీజేపీ ఓటింగ్కు ఏ విధంగా కలిసోస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: