జమిలి ఎఫెక్ట్: మహిళల ఖాతాలో రూ.1500 పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!
మహిళా పథకాల పైన కూడా ఈ బడ్జెట్ లోనే క్లారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటి రోజున ప్రారంభం కాబోతున్నాయి.. ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి బడ్జెట్ కూడా ముగిసిందట. వారం రోజులపాటు జరిగే సమావేశాలలో అనేక బిల్లులను సైతం ప్రభుత్వం ప్రతిపాదించబోతున్నట్లు సమాచారం.. ఈ సమావేశాలకు ముందు ఏపీ ప్రభుత్వం మంత్రివర్గం కూడా సమావేశం కాబోతున్నదట. ఈ బడ్జెట్ లోనే సూపర్ సిక్స్ హామీలను సైతం అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట.
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం కూడా వీటి పైన అప్రమత్తంగా ఉండి ఇందులో భాగంగా పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం అమలు చేసినది.. ఇప్పుడు జనవరి నుంచి జన్మభూమి-2, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పైన కూడా ప్రతిపాదన తీసుకు రాబోతున్నట్లు సమాచారం. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అమలు చేయాలని చూస్తున్నారట.. ముఖ్యంగా 18 నుంచి 59 సంవత్సరాల వయసులోపు మహిళలకు అందిస్తామన్న 1500 రూపాయలు పథకాన్ని కూడా అమలు చేయాలని కూటమినేతలు పట్టుబడుతున్నారట. వీటితో పాటు పదిలక్షల వడ్డీ లేని రుణాలను అందించడం అలాగే యువతకు రూ .3000 రూపాయలు స్టెఫండ్ పైన కూడా ప్రతిపాదన తీసుకువచ్చే అంశాలను తీసుకువస్తున్నారట.