రేవంత్ కు షాక్..కేసీఆర్ లేపుతున్న టీడీపీ ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో... గడిచిన 10 సంవత్సరాలలో కెసిఆర్... అద్భుతమైన పాలన కొనసాగించారని టిడిపి ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి బద్ధ శత్రువు రఘురామకృష్ణం రాజు సంచలనం కలిపేశారు. తెలంగాణ ఆస్తులను 10 రెట్లు పెంచిన ఘనత కేవలం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దక్కుతుందని.. రఘురామకృష్ణం రాజు వెల్లడించడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన రఘురామకృష్ణం రాజు... మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ ద్వారా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు... వైసీపీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు రఘురామకృష్ణంరాజు.  ఆ పార్టీ నుంచి నరసరావుపేట ఎంపీగా విజయం సాధించినప్పటికీ  కొన్ని కారణాల వల్ల జగన్ ను టార్గెట్ చేశారు రఘురామకృష్ణరాజు. జగన్కు వ్యతిరేకంగా కేసులు వేయడం... ఆయనకు వ్యతిరేకంగా టీవీ డిబేట్లో కూర్చోవడం, ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ కుటుంబాన్ని తిట్టడం లాంటివి రఘురామకృష్ణం రాజు చేసిన సంగతి తెలిసిందే.

అదే సమయంలో రఘురామకృష్ణం రాజును టార్గెట్ చేసి వైసిపి ప్రభుత్వం... ఆయనను చిత్రహింసలు పెట్టింది. ఒకసారి జైల్లో వేసి దారుణంగా పోలీసులు కొట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే 2024 ఎన్నికల కంటే ముందు చాలా చాకచక్యంగా... ఆలోచించి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రఘురామకృష్ణంరాజు. ఈ తరుణంలోనే ఉండి నియోజకవర్గ టికెట్ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు. ఇక అక్కడ వైసిపి బలంగా లేకపోవడంతో చాలా అలవోక  గా విజయం సాధించారు.. రఘురామకృష్ణం రాజు.

అయితే అలాంటి టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తాజాగా... చంద్రబాబు నాయుడు శత్రువు కల్వకుంట్ల చంద్రశేఖర రావును మెచ్చుకున్నారు. టిడిపి అంటే అసలు కేసీఆర్ కు పడదు.  అదే సమయంలో కెసిఆర్ అంటే... అగ్గి గుగ్గిలంలా లేస్తుంది టిడిపి. అలాంటి కెసిఆర్ పైన తాజాగా రఘురామకృష్ణం రాజు హాట్ కామెంట్స్ చేశారు. కెసిఆర్ 10 సంవత్సరాల పాలనలో...  తెలంగాణ ఆదాయం పదిరెట్లు పెరిగిందని వివరించారు. తెలంగాణలోని కరీంనగర్ లాంటి ప్రాంతాలలో.. గతంలో ఎకరం 10 లక్షలు ఉన్న  భూమి వ్యాల్యూ ను కోటి రూపాయల వరకు చేర్చిన ఘనత.. కేవలం కేసీఆర్ దేనని కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: