తల్లి, చెల్లిపై కోర్టులో జగన్ పిటిషన్.. షర్మిలపై పగతో మాజీ సీఎం ఇంతకు తెగించారా?

Reddy P Rajasekhar
మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. తల్లి, చెల్లిపై జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఒకింత సంచలనం అవుతోంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌ లో తల్లి, చెల్లి మోసం చేశారంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ చాలా రోజుల క్రితమే ఈ పిటిషన్ దాఖలు చేసినా ఈ విషయం ఒకింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
షర్మిలపై పగతో జగన్ ఇంత తెగించారా అంటూ ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో సరస్వతీ పవర్ అనే కంపెనీని ఏర్పాటు చేయగా అందులో విజయమ్మ, షర్మిల పేర్లపై కొన్ని షేర్లు ఉన్నాయి. అయితే విజయమ్మ షర్మిలపై ఉన్న ప్రేమతో తనపై ఉన్న షేర్లను కూతురి పేరుపై బదలాయించగా జగన్ తన షేర్లను తనకు ఇచ్చేయాలని కోర్టును ఆశ్రయించడం జరిగింది.
 
వాస్తవానికి పేపర్లపై ఏర్పాటైన ఈ కంపెనీకి భూములు తప్ప ఏమీ లేవు. చాలా సంవత్సరాల క్రితమే భూములు తీసుకున్నా అక్కడ సంస్థలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించలేదు. అయితే షర్మిల వల్లే తాను ఎన్నికల్లో ఓడిపోయానని భావించి జగన్ ఈ దిశగా అడుగులు వేశారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై విజయమ్మ, షర్మిల రియాక్షన్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.
 
షేర్లను విత్ డ్రా చేసుకోవాలని జగన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. జగన్ తరపున న్యాయవాది వై సూర్యనారాయణ వాదనలు వినిపించనున్నరని నవంబర్8వ తేదీన ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణ జరగనుందని తెలుస్తోంది. జగన్ పిటిషన్ వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారగా ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు, నిర్ణయాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: