ఏపీ: భయంతోనే జగన్ కంటే ముందుగా డిప్యూటీ సీఎం అక్కడ..!

Divya
గత కొద్ది రోజులుగా ఉత్తరాంధ్ర ప్రజలను అతిసారా కేసులు భయభ్రాంతులకు గురయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో గొర్ల మండలంలో ఈ అతిసారా కేసులు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఇప్పటికే 12 మంది దాకా మరణించినట్లు సమాచారం. అలాగే మరికొంతమంది ఆస్పత్రిపాలైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కలుషితమైన నీతిని తాగడం వల్ల వీరికి ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయని ఇటీవలే ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో వైద్యరంగం అభివృద్ధి చెందింది కానీ ప్రజలకు మౌలిక సదుపాయాలు పెంచడంలో ప్రభుత్వం విఫలమయ్యిందనే వాదనలు వినిపించాయి.

అది కూడా విజయనగరం వంటి జిల్లా కేంద్రంలో కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా మంచి నీటిని అందించలేకపోవడంతో ఇప్పుడు ఇది హార్ట్ టాపిక్ గా మారుతోంది ఏపీలో. ఇదంతా కేవలం పాలకుల నిర్లక్ష్యం వల్లే జరిగిందనే విధంగా పలువురు నేతలు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. కనీసం ప్రజలకు మంచినీళ్లు అందించలేకపోవడం అంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన బొత్స సత్యనారాయణ కూడా ఏకంగా మరణాల పైన ప్రెస్ మీట్ పెట్టి సర్కారు వైఫల్యానికి కారణాలను విమర్శించడం జరిగింది.

అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాసులు మాత్రం ఇదంతా కూడా గత ప్రభుత్వం వైఖరి వల్లే జరిగింది అంటూ వెల్లడించారు. దీంతో ఈ విషయం అటు డిప్యూటీ సీఎం వరకు వెళ్ళగా ఈ రోజున విజయనగరం జిల్లా గుర్ల మండలానికి వెళ్లబోతున్నారట. అక్కడ అతిసారా బాధితులను సైతం పరామర్శించడానికి వెళ్లబోతున్నట్లు సమాచారం. సాధారణంగా అయితే అక్కడ ప్రతిపక్ష నేత ఆయన జగన్ వెళ్లాలి.. కానీ కేవలం ట్విట్ తో మాత్రమే వదిలేశారు. అయితే ఇప్పటివరకు జగన్ వెళ్లిన చోటు కల్లా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారనే విధంగా వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఆలస్యంగా ప్రభుత్వం రియాక్ట్ అయినప్పటికీ ప్రతిపక్ష నేత కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారట.. అక్కడ అన్నిటిని పరిశీలించబోతున్నట్లు సమాచారం. సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఈ అతిసారా కేసుల గురించి నివేదికను ఇవ్వబోతున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఉత్తరాంధ్రకు పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. మరి మాజీ సీఎం జగన్ కూడా గుర్ల టూర్ కి వెళ్తారా లేదా అనే విషయం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: