కొండా సురేఖపై వరంగల్ కాంగ్రెస్ తిరుగుబాటు?
ఇవి వివాదం మరువక ముందే...వేములవాడ రాజన్న సన్నిధిలో... దేవుడికి నైవేద్యం పెట్టకుండా.. పూజలు చేయించుకున్నారని కొండా సురేఖ పైన ఆరోపణలు వచ్చాయి. ఇలా 15 రోజుల్లోనే రకరకాల వివాదాలతో.. కొండా సురేఖ ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కొండా సురేఖ పై వరంగల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుగుబాటు చేసేందుకు రెడీ అయ్యారు.
ఇప్పటికే కొండా సురేఖ అంశం పైన కాంగ్రెస్ అధిష్టానానికి... ఫిర్యాదు కూడా చేశారు కాంగ్రెస్ నేతలు. మొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. వరంగల్ అంటేనే కొండ మురళి అన్నట్లుగా కొండా సురేఖ దంపతులు రాజకీయాలు చేస్తున్నారట. దీంతో విసిగిపోయిన వరంగల్ కాంగ్రెస్ నేతలు.. ఆమెను అదుపులో పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. అయితే వరంగల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ హై కామండ్ డిఫరెంట్ గా స్పందించింది.
రివర్స్ గా కాంగ్రెస్ నేతల పైన సీరియస్ అయిందట కాంగ్రెస్ పార్టీ హై కమాండ్. చిన్న చిన్న గొడవలు పడి కొండా సురేఖను... ఇరికించకూడదని కూడా చురకలు అంటించిందట. అలాగే కొండా సురేఖ వ్యవహారాన్ని... తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించిందట కాంగ్రెస్ పార్టీ. దగ్గరుండి ఈ అంశాన్ని... చూసుకోవాలని ఆదేశించిందట. దీంతో రంగంలోకి దిగిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నేతలు అలాగే కొండ సురేఖతో మాట్లాడబోతున్నారట.