బాల‌య్య ఇలాకాలో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం...!

RAMAKRISHNA S.S.
- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) . .
ప్రముఖ సినీ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో రాజకీయం రస‌వత్త‌రంగా మారింది. హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం రాజకీయం జోరుగా జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలలో అడ్డగోలుగా వ్యవహరించిన వైసిపి ఏకగ్రీవాలు బెదిరింపులతో 36 మంది కౌన్సిలర్లకు గాను వైసీపీ 30 సీట్లు గెలిచింది .. టిడిపి కేవలం 6 వార్డులనే గెలుచుకుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ తో పాటు 11 మంది కౌన్సిలర్లు టిడిపిలో చేరారు.. ఇంద్ర‌జ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక అనివార్యం అయింది.

ఆల్రెడీ టిడిపికి ఆరుగురు కౌన్సిలర్లు ఉండగా వైసిపి నుంచి 11 మంది వచ్చి చేరడంతో టిడిపి బలం 17 అయ్యింది. హిందూపురం ఎంపీ ... ఎమ్మెల్యే తో పాటు ఇతర ఎక్స్ అఫీషియో మెంబర్లు కూడా ఉంటారు. కాబట్టి టిడిపికే చైర్పర్సన్ పదవి దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇంద్రజితో పాటు వచ్చిన నలుగురు కౌన్సిలర్లను వైసీపీ బతిమిలాడి భారీగా ముట్ట చెప్పి వెనక్కి రప్పించుకుంది. వారిని జగన్ వద్దకు కూడా తీసుకువెళ్లారు నేతలు. అయితే వైసిపికి మరో సమస్య వచ్చింది .. కొత్త చైర్పర్సన్ గా ఎంపిక చేసిన కౌన్సిలర్ ని విష‌యంలో వైసిపిలో ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

ఇక్క‌డ ఎమ్మెల్యే గా నందమూరి బాలకృష్ణ ఈ రాజకీయాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ .. ఫాలో చేస్తున్నారు. నలుగురు కౌన్సెలర్లు వెనక్కి పోవడంతో పాటు వైసీపీలో ఉన్న అసంతృప్తిని గమనించి మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్ గా మళ్లీ ఇంద్రజనే గెలిచేలా సూచనలు చేస్తున్నార‌ట‌. ఏదేమైనా హిందూపురం మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ ఎన్నిక ఇప్పుడు అక్క‌డ రాజ‌కీయాన్ని ర‌స‌వ‌త్త‌రంగా మార్చేసింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: