టాటా వ్యాపారాల విజయ రహస్యం ఇదే.. ఆయనకు శత్రువే లేడు..?

Veldandi Saikiran
దిగ్గజ వ్యాపారవేత్త, పారిశ్రామిక రంగంలోనే కింగ్ లాంటి రతన్ టాటా... నేలకొరిగాడు. బుధవారం అర్ధరాత్రి... ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో రతన్ టాటా.. మరణించడం జరిగింది. తీవ్ర అనారోగ్యానికి గురైన... రతన్ టాటా... ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు. దీంతో దేశవ్యాప్తంగా... విషాద ఛాయలు అలుము కున్నాయి. అయితే అలాంటి రతన్ టాటా... మరణించడం పట్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

చంద్రబాబు లాంటి వ్యక్తులు ముంబైకి వెళ్లి కూడా... రతన్ టాటా పార్థివ దేహానికి... నివాళులర్పించడం జరిగింది. ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక లాంచనాలతో... రతన్ టాటా అంతక్రియలు జరగనున్నాయి. అయితే ఇదంతా పక్కకు పెడితే... అతి తక్కువ కాలంలోనే... పారిశ్రామికంగా దేశవ్యాప్తంగా... రతన్ టాటా సక్సెస్ కావడానికి... అనేక కారణాలు ఉన్నాయి.

ఆయన ప్రతి విషయంలో అనేక విమర్శలను ఎదుర్కోవడం జరిగింది. విమర్శలు ఎదుర్కొన్న ప్రతిచోట నిలబడి పనిచేశాడు. వాటిని సోపానాలుగా మలుచుకొని... టాటా చైర్మన్ అయ్యాక తనదైన నిర్ణయాలతో... కంపెనీ ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడు. అలాగే లండన్ టెట్లీ ఈ కొనుగోలు అలాగే కార్ల తయారీ సంస్థలు జాగ్వార్... రతన్ టాటానే కొనుగోలు చేశారు. ల్యాండ్ రోవర్ తో పాటు కోరస్ స్టీల్ ను కొనుగోలు చేసి... టాటా కంపెనీలో వాటిని... మెర్జ్ చేసి సక్సెస్ అయ్యారు.

సామాన్యులకు అందుబాటులో ఉండేలా నానో కార్లు లక్ష రూపాయలకు.. తీసుకువచ్చి మార్కెట్లోకి వదిలారు రతన్ టాటా. అదే సమయంలో ఆటో, టెలి కమ్యూనికేషన్, ఐటీ రంగాల్లో కూడా తనదైన ముద్రను వేసుకున్నారు.  బిజినెస్ చేస్తే లాభాల కోసం కాకుండా ప్రజల కోసం... ఉండేలా ఆయన ప్రతి నిర్ణయం ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ శత్రువులు లేని.. ఒక బడా వ్యాపారవేత్తగా రతన్ టాటా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: