టీవీ5 అధినేతకు చంద్రబాబు పంగనామాలు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత... పలు సంచలన నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. జనసేన, భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ నేతలను... సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఇందులో భాగంగానే మూడు పార్టీల మధ్య పదవుల పంపకాలు కూడా జరుగుతున్నాయి.  కేప్ నెట్ విస్తరణ అలాగే మొన్న నామినేట్ పదవుల విస్తరణ... చాలా సామరస్యంగా నిర్వహించారు చంద్రబాబు నాయుడు.

అయితే ఇలాంటి నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి భర్తీ చేసినందుకు...  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిటిడి చైర్మన్ గా టీవీ ఫై ఛానల్ ఓనర్ BR నాయుడు  ఫైనల్ అయినట్టు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీవీ5 అధినేత నాయుడు... ఆయనను ఆదుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడంలో.... టీవీ5 సంస్థలు అధినేత నాయుడు సక్సెస్ అయ్యారు.

ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దిగిపోవడానికి కారణం కూడా.. ఎల్లో మీడియా కారణమని చెబుతూ ఉంటారు.  అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత టిటిడి చైర్మన్ పదవి టీవీ పై సంస్థల అధినేత నాయుడుకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అయితే దీనిపై జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తువు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు పదవి కాకుండా వేరే వారికి ఇవ్వాలని అంటున్నారట.

దీంతో... టీవీ5 అధినేత  నాయుడుకు ఈ పదవి దక్కే అవకాశాలు లేవని కొంతమంది చెబుతున్నారు. ఆయన స్థానంలో రఘురామకృష్ణరాజు, లేదా అశోక్ గజపతి రాజు  పేర్ల మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. లేదా ఇతర వ్యక్తులకు.. ఇవ్వాలని అంటున్నారు. అవసరమైతే బిజెపి పార్టీలో ఎవరైనా కీలక నేతలను టిటిడి చైర్మన్ గా నియామకం చేయాలని కూడా చెబుతున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో... నాయుడుకు పదవి ఇస్తే మరింత గందరగోళం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు... కూటమి నేతలు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: