ఆ సినిమాతో సంక్రాంతి సక్సెస్ అందుకున్న సౌందర్య.. పర్ఫామెన్స్ తో అదరగొట్టారుగా!

Reddy P Rajasekhar
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ సౌందర్యకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. విభిన్నమైన కథలను ఎంచుకుని ప్రతి సినిమాలో అద్భుతమైన అభినయంతో మెప్పించిన సౌందర్య కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎదిగి నటిగా ప్రశంసలు అందుకున్నారు. చిరంజీవి, సౌందర్య కాంబినేషన్ లో తెరకెక్కిన అన్నయ్య మూవీ 2000 సంవత్సరంలో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.
 
ఈ సినిమాలో సౌందర్య పర్ఫామెన్స్ న భూతో న భవిష్యత్ అనేలా ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. చిరంజీవి ఏ రోల్ అయినా అద్భుతంగా అదరగొడతాడు. ఈ జనరేషన్ ప్రేక్షకులకు సైతం ఎంతగానో నచ్చే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
 
సౌందర్య 2004 సంవత్సరంలో ఒక ప్రమాదంలో మృతి చెందారు. చిరంజీవి కెరీర్ విషయానికి వస్తే ఈ హీరో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ల ఎంపిక విషయంలో సైతం చిరంజీవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశ్వంభర సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఒక సినిమాలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.
 
స్టార్ హీరో చిరంజీవి రెమ్యునరేషన్ ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. చిరంజీవి ఒక్కో సినిమాకు 60 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి తర్వాత సినిమాలతో సైతం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. సౌందర్య భౌతికంగా మరణించినా అభిమానుల హృదయాల్లో మాత్రం ఆమె ఇప్పటికీ జీవించే ఉన్నారు. సౌందర్య తర్వాత వాళ్ల కుటుంబం నుంచి ఎవరూ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వకపోవడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: