రివ్యూ: నవాబ్ కేఫ్... ఎమోషనల్ కేఫ్
కథ :
పాతబస్తీలో రంగనాథ్(రాజీవ్ కనకాల) కుటుంబం తరతరాలుగా నవాబ్ కేఫ్ పేరుతో ఓ చాయ్ దుకాణాన్ని నడుపుతూ వుంటుంది. అతని కుమారుడు రాజా (శివ కందుకూరి) జులాయిగా తిరుగుతూ తన మిత్రుడు(రాజ్ కుమార్ కసిరెడ్డి) తో సరదాగా కాలం గడిపేస్తూ వుంటాడు. ఈ క్రమంలో అతనికి సఖి (తేజు అశ్విని)తో పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటాడు. అయితే తన పెదనాన్న కుమారుడు కుమార్ బాబు(చైతన్య) రియల్ ఎస్టేట్ లో బాగా సంపాధించి లగ్జరీగా గడిపేస్తూ వుంటాడు. ఇది చూసిన రాజా... తను కూడా అలాంటి లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయాలని తన తండ్రికి చెబుతాడు. పాతబస్తీ నడిబొడ్డున వున్న 1200 గజాల స్థలాన్ని రూ.50కోట్లకు అమ్మేసి... జూబ్లీహిల్స్ లో ఒక బంగ్లా, ఓ బెంజ్ కారు కొనేసి బిందాస్ గా బతికేద్దామని చెబుతాడు రాజా. ఈ విషయమై ఇద్దరి మధ్య వాదోప వాదాలు జరగడంతో... మనస్థాపం చెందిన రంగనాథ్... సడన్ గా చనిపోతారు. ఆ తరువాత రాజా ఏమి చేశాడు ? నవాబ్ కేఫ్ స్థలాన్ని అమ్మేసి బిందాస్ లైఫ్ అనుభవించాడా ? తన తండ్రి మరణం తరువాత ఎలాంటి లైఫ్ ను లీడ్ చేశాడు? అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి ? నవాబ్ కేఫ్ ను అమ్మాలని సలహా ఇచ్చింది ఎవరు ? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ... కథనం విశ్లేషణ :
తర తరాలుగా జీవనం సాగిస్తున్న ఇళ్ల మీదగానీ... వ్యాపారాల మీదగానీ అంతగా లాభాలు లేకపోయినా వాటి మీద మమకారం మాత్రం మన పెద్దలకు వుంటుంది. అందుకే వాటిని వారసత్వంగా కాపాడుకుంటూ వస్తూవుంటారు. ఈతరం యువతకు వాటిని చూసి చాదస్తం అనిపించినా... వాటిపై వున్న సెంటిమెంట్ అనేది అనుభవంలోకి వస్తేగాని తెలియదు. నవాబ్ కేఫ్ మూవీలో కూడా అదే చూపించారు యువదర్శకుడు ప్రమోద్ హర్ష. పూర్వం నుంచి వారసత్వంగా వస్తున్న చాయ్ వ్యాపారాన్ని లాభసాటిగా లేకపోయిన దానినే నమ్ముకుని కుటుంబాన్ని పోషించే తండ్రి... తనకు తోచినంతలో పరాయి వారికి సహాయం చేస్తూ... గౌరవంగా బతికే కుటుంబం నేపథ్యాన్ని ఇందులో ఎంతో ఎమోషనల్ గా చూపించారు డెబ్యూ దర్శకుడు హర్ష. ఎక్కడా వల్గారిటీ లేకుండా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమాను తెరమీద ఆవిష్కరించారు.
ఫస్ట్ హాఫ్ అంతా రాజా అల్లరి చిల్లరగా తిరుగుతూ... బిటెక్ బ్యాక్ లాగ్స్ ను కంప్లీ చేయకుండా తండ్రి సంపాదనతో బతికే ఓ సాదారణ యువకుని పాత్రను చూపించిన తదర్శకుడు... ఇంటర్వెల్ తరువాత చాలా బాధ్యతాయుతంగా నడుచుకునే పాత్రను ఈ తరం యువతకు ఆదర్శంగా నిలిచేలా మలిచాడు. అలాగే వారసత్వంగా వచ్చే ఆస్తులు ఎంత ఖరీదు చేసినా... వాటిని ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమ్ముకోకూడదనేదాన్ని ఇందులో ఎంతో ఎమోషనల్ గా చూపించారు. నిజాయతీగా వ్యాపారం చేసినా... కొంత మంది స్వార్థపరుల వల్ల ఎలాంటి కష్టనష్టాలను ఫేస్ చేయాల్సి వస్తుందో కూడా ఇందులో చూపించారు. అయితే ఫస్ట్ హాఫ్ ను ఇంకాస్త ఆసక్తికరమైన మలుపులతో స్క్రీన్ ప్లేను నడిపివుంటే మరింత ఆకట్టుకునేలా వుందేడి. ఓవరాల్ గా నవాబ్ కేఫ్... క్లీన్ ఫ్యామిలీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.
యువహీరో శివ కందుకూరి డీసెంట్ నటనతో ఓ పక్కంటి అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. ముఖ్యంగా సెకెండాఫ్ లో చాలా సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ చూపించాడు. అతనికి జోడీగా నటించిన తేజు అశ్విని కూడా సంప్రదాయంగా కనిపించి పక్కింటి అమ్మాయిలాగా మెప్పించింది. తన క్యూట్ హోమ్లీ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. చైతన్య నెగిటివ్ రోల్ లో ఉన్నంతలో బాగానే చేశాడు. రాజీవ్ కనకాల ఎప్పటిలాగే తన నాచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. స్నేహితునిగా నటించిన రాజ్ కుమార్ కసిరెడ్డి కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించాయి.
దర్శకుడు ప్రమోద్ హర్షకి ఇది డెబ్యూ మూవీనే అయినా... ఇలాంటి బరువైన ప్లాట్ ను ఎంచుకోవడం కాస్త సాహసమే అని చెప్పొచ్చు. ఓ చక్కటి ఫ్యామిలీ డ్రామను చాలా ఎమోషనల్ గా ఆవిష్కరించి సక్సెస్ అయ్యారు. సెకండాఫ్లో సినిమాను ఎమోషనల్గా నడిపించేందుకు దర్శకుడు పడిన కష్టంగా తెరమీద కనిపిస్తుంది. ఎమోషనల్ డెప్త్ బాగా మెయింటైన్ చేశారు. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ బాగా డిజైన్ చేశారు. కథకు తగ్గట్టుగానే సాంకేతిక నిపుణులు కూడా ఎంచుకున్నారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుని తెరమీద ఫ్యామిలీడ్రామా మూడ్ ను బాగా చూపించారు. విజువల్స్ బాగా చూపించారు. అలాగే సంగీతం కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఎంతో ఉన్నతంగా సినిమాను వెండితెరపై ఆవిష్కరిచారు. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా నీట్ గా చేశారు. పాత బస్తీ సెట్టింగ్ అంతా బాగా ప్రెజెంట్ చేశారు. ఈ వీకెండ్ లో సరదాగా ఫ్యామిలీతో చూసేయండి.
రేటింగ్ : 2.75 / 5