"సిగ్గున్నోడు ఎవడైనా అలా చేస్తాడా..?".. కోపంతో ఊగిపోయిన కీర్తి సురేష్..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్న విషయం అందరికీ తెలుసు . మరీ ముఖ్యంగా రీసెంట్ గానే ఆమె పెళ్లి చేసుకుంది . తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ సినిమా ఇండస్ట్రీలో తాను కమిట్ అయిన సినిమాలను మాత్రం దూరం పెట్టడం లేదు . పెళ్లయినా సరే బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో ఎలా పాల్గొనిందో అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుము తెరకెక్కి  రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది . తుస్సు మనే కలెక్షన్స్ సాధించింది . మిక్స్డ్ రివ్యూ లతో ఈ సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే ఫలితం ఎలా ఉన్న సినిమాలో కీర్తి పర్ఫామెన్స్ గ్లామర్ డోస్ హైలెట్గా మారాయి .


ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ బాగానే కష్టపడింది.  మరి ముఖ్యంగా పెళ్లి తర్వాత ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా పాల్గొనింది . ఇదే మూమెంట్లో పెళ్లి తర్వాత కీర్తి సురేష్ మెడలో తాళి వేసుకొని కనిపించడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది .  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఈవెంట్స్ కి అటెండ్ అవుతున్నప్పుడు ఫోటోగ్రాఫర్లు కీర్తి సురేష్ పిక్స్ తీసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించారు . అయితే ఓ ఈవెంట్లో కీర్తి సురేష్ ని ఓ ఫోటో గ్రాఫర్ బ్యాడ్ యాంగిల్ లో ఫొటోస్ తీయడానికి  ఆసక్తి చూపించారు .


కీర్తి కారులోకి ఎక్కుతూ ఉండగా అవతలి వైపు నుంచి ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తూ ఉంటే అప్పుడే కీర్తి సురేష్ అసిస్టెంట్ వచ్చి వాదించారు . అంతేకాదు దీని మీద చిన్న గొడవ కూడా జరిగింది . అయితే కీర్తి ఆ గొడవ పై తాజాగా స్పందించింది . "ఆ గొడవ అసలు ఎందుకు జరిగిందో..? ఎలా జరిగిందో ..? నాకు ఆ టైంలో అర్థం కాలేదు . తర్వాత నా అసిస్టెంట్ నాకు వివరంగా వివరించింది . నేను అప్పటికే చాలా ఫోటోగ్రాఫర్స్ కి ఫోజులు ఇచ్చాను. అడిగితే ఇంకా కొన్ని కూడా ఇస్తాను.  కానీ అలా కారులో ఎక్కుతూ ఉండగా బెండ్ అయినప్పుడు అవతల నుంచి ఫోటో తీయడం కరెక్టేనా..? అది ఎంత బ్యాడ్ యాంగిల్ అనేది తెలియదా..? అలాంటి ఫోటోలు తీయడం ద్వారా వాళ్ళకి ఏమి వస్తుంది..? అది తప్పు కదా ..? అంటూ ఫైర్ అయింది. ఓపికగా ఫోటోలకి ఫోజులు ఇచ్చిన తర్వాత కూడా ఇలా చేయాల్సిన అవసరం ఏముంది ..? అంటూ మండిపడింది . కాగా  ఓ ఈవెంట్లో కీర్తి సురేష్ రెడ్ డ్రెస్ వేసుకుని జీప్  దిగుతూ ఉండగా కొందరు ఫోటోగ్రాఫర్లు ఫోటో తీసి ఎంత వైరల్ చేశారో చూసాం". బోల్డ్ కామెంట్స్ కూడా వినిపించాయి . దీంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . అసలు సిగ్గు ఉండేవాళ్ళు అలా చేస్తారా..? ఒక అమ్మాయిని అలా ఫొటోస్ తీస్తారా..? అంటూ ఫైర్ అవుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: