ఇక హీరోలు అలా మూతి ముడుచుకుంటే కుదరదమ్మ.. ఎవ్వడైన దిగి రావాల్సిందే..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నది అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన వార్తలే.  అయితే అల్లు అర్జున్ ఏది కావాలని చేయలేదు . బై మిస్టేక్ అలా జరిగిపోయింది . అయితే చాలామంది స్టార్ హీరోస్ మాత్రం సినీ ప్రమోషన్స్లో పాల్గొనాలి అంటే భయపడిపోతున్నారు . ఎక్కడ అభిమానులు చూపించే అత్యుత్సాహ ప్రేమతో బలి అవ్వాల్సి వస్తుంది అంటూ భయపడుతూ సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించుకోవడమే మానేస్తున్నారు కొంతమంది స్టార్స్. వాళ్లు నటించిన సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న సరే నిమ్మకి నీరెత్తిన్నట్లు  చాలా సైలెంట్ గా ఉంటున్నారు .


ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ అంటే ఎంత రచ్చ రంబోలా ఉండేదో తెలిసిందే. మరి ముఖ్యంగా సంక్రాంతి రేసులో నిలుస్తున్నారు అంటే మాత్రం దబిడి దిబిడే అనే రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహించుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది . అసలు నిజంగానే ఆ సినిమా చెప్పిన డేట్ కి రిలీజ్ అవుతుందా..? అని ఫాన్స్ కూడా సందేహ పడేలా స్టార్ హీరోస్ తమ సినిమా విషయంలో ప్రవర్తిస్తున్నారు . కాగా రీసెంట్గా వెంకటేష్ మాత్రం అలాంటి వాళ్లకి బాగా బుద్ధి వచ్చినట్లు చేశారు . "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది .


"అనిల్ రావిపూడి" దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నారు. వెంకటేష్ ఎంత పెద్ద స్టార్ అన్న విషయం అందరికి తెలిసిందే . పైగా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా.  ఆయన వద్దు అన్న కూడా జనాలు వచ్చి చూస్తారు. కానీ ఎక్కడ కూడా వెంకటేష్ ఆ విషయాన్ని ప్లస్గా తీసుకోకుండా సినిమా కోసం బాగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. డైరెక్టర్.. ప్రొడ్యూసర్ ఎక్కడికి చెప్తే అక్కడికి వచ్చి తన సినిమాకి  ప్రమోషన్స్ నిర్వహించుకుంటున్నారు .


అయితే సంక్రాంతి రేసులో ఉన్న మిగతా సినిమాల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది . దీంతో కొంతమంది సినీ ప్రముఖులు అలాంటి వాళ్ళపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ కి రాము.. మేము పెద్ద స్టార్ ..పాన్ ఇండియా స్టార్స్.. ఫ్యాన్స్ మా సినిమాను ఎలాగైనా హిట్ చేస్తారు అంటే కుదరదమ్మ .. ఎలాంటి వాళ్ళైనా సరే సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించుకోవాల్సిందే . ఒక మెట్టు దిగాల్సిందే అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. కాగా రీసెంట్గా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ ఎంత హుందాగా ప్రవర్తించాడో అందరికీ తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: