మార్కో విజయం దేనికి సంకేతం !
ఈమూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ టాలీవుడ్ లో ఆలస్యంగా విడుదల అయినప్పటికీ ఈమూవీకి మొదటిరోజే సుమారు 1కోటీ 75 లక్షలు కలక్షన్స్ రావడం చాలామందికి షాక్ ఇస్తోంది. విపరీతమైన హింస కొన్ని జుగుప్సాకర సన్నివేశాలున్నాయి. విలన్ చేసే అతి దారుణమైన మర్డర్లతో నిండిపోయిన ఈసినిమాను తెలుగు రాష్ట్రాలలోని యూత్ బాగా చూస్తూ ఉండటంతో ఈ డబ్బింగ్ మూవీ కూడ హిట్ లిస్ట్ లో చెరిపోయింది.
ఇలాంటి పూర్తి హింసతో కూడిన సినిమాలు యూత్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండటంతో వారి మానసిక స్థితి పై ఇలాంటి సినిమాలు చాల ప్రభావాన్ని చూపెడతాయని కొంతమంది మనస్తత్వ శాస్త్ర వేత్తలు అంటున్నారు. సినిమాలలో కనిపించే ఇలాంటి దారుణమైన సన్నివేశాలు ఎంతోకొంత యూత్ మైండ్ ను తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది అని అంటున్నారు.
నేటి యూత్ సినిమాలలో చూపించే మంచిని గుర్తించుకోలేకపోయిన ‘ఏ’ సర్టిఫికెట్ ఉన్న ఈసినిమాను యూత్ విపరీతంగా చూస్తున్న పరిస్థితులలో నెటితరంలో నైతిక విలువలు తగ్గే ఆస్కారం ఉంది అంటూ అని అంటున్నారు. గతంలో సందీప్ వంగా ‘యానిమల్ మూవీని ఇలాంటి హింస సీన్స్ తో తీసిన పరిస్థితులలో మార్కో ఘన విజయం ట్రెండింగ్ న్యూస్ గా మారింది. భాగమతి మూవీలో అనుష్క పక్కన నటించిన ఉన్ని ముకుందన్ కు తిరిగి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందే అవకాశాన్ని ‘మార్కో’ కలగ చేసేంది. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గర అయిన పరిస్థితుల్లో తెలుగు మాస్ ప్రేక్షకులకు ఈసినిమాతో ఉన్ని ముకుందన్ దగ్గర అయ్యాడు అనుకోవాలి..