2029లో వైసీపీ 175 సీట్లు..ఇది రాసిపెట్టుకోండి ?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కేవలం..11 స్థానాలు దక్కడం మనం చూశాం. నాలుగు మాత్రమే పార్లమెంటు స్థానాలు కూడా వచ్చాయి. అయితే.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి... వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కొడాలి నాని వల్లభనేని వంశీ రోజా, అంబటి రాంబాబు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు అందరూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు.
మంత్రులు అందరూ ఓడిపోవడం జరిగింది. దీంతో.. వైసీపీ పార్టీ కుదేలు అయిపోయింది. దానికి తగ్గట్టుగానే వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం రకరకాల కేసులను పెట్టడం జరుగుతుంది. కేసులతోపాటు దాడులు కూడా జరుగుతున్నాయి. దీంతో వైసిపి పార్టీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో వైసిపి పార్టీ కార్యకర్తలకు బలం చేకూర్చేలా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. 2029లో వైసీపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని కూడా వివరించారు.
2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు అందరూ కలిసి...పార్టీని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారని గుర్తు చేశారు. ఇక త్వరలోనే మళ్లీ వైసీపీ నేతలు అందరూ ఆక్టివ్ అవుతారని కూడా అభివర్చారు. వైసిపి కార్యకర్తలు అందరూ తిరగబడితే కూటమి నేతలందరూ... పుట్టకొకడు చెట్టుకొకడు అవుతాడని కూడా హెచ్చరించారు. కొన్ని రోజులు తాము ఓపిక పడుతున్నామని...అతి త్వరలోనే కం బ్యాక్ అవుతామని కూడా ఆయన వెల్లడించారు.