ఏపీ: లడ్డూ వివాదంలో మళ్లీ చెలరేగిపోయిన జగన్..!

Divya
తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదంగా భావించే లడ్డూలో కల్తీ జరిగిందని సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ముఖంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం ఇటీవల సుప్రీంకోర్టులో చర్చకు రాగా.. కోర్టు మండిపడుతూ సిట్ రద్దు చేసింది. ఈ విషయంపై మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడుతూ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీరుపై ఈ విధంగా స్పందించారు. చంద్రబాబు నిజస్వరూపం సుప్రీంకోర్టుకు తెలిసింది. అందుకే సుప్రీంకోర్టు ఆయన వేసిన సిట్ రద్దు చేసింది. దేవుడిని రాజకీయాలలోకి లాగవద్దు అంటూ కోర్టు తెలిపిందని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి.  రాజకీయ డ్రామాలు చేయొద్దని వారిని హెచ్చరించిందని కూడా తెలిపారు . ఇకపోతే లడ్డూ లో జంతువుల కొవ్వు వాడారని అబద్ధాలు చెప్పారని జగన్ ఫైర్ అయ్యారు.. అంతేకాదు తిరుమలను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని కూడా మండిపడ్డారు.
సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేసిందని,  చంద్రబాబు నిజ స్వరూపాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ఎత్తి చూపించిందని కూడా ఎద్దేవా చేశారు. కల్తీ లడ్డు అంశంపై చంద్రబాబు,  టీటీడీ ఈవో చేసిన వ్యాఖ్యలలో వ్యత్యాసం చాలా ఉందని,  సుప్రీంకోర్టు వరకు అవసరం లేదు ప్రజలే ఈ విషయాన్ని గుర్తించారని కూడా ఆయన తెలిపారు. దేవుడంటే భయం లేకుండా ఇప్పటికే తప్పుడు ప్రచారాలు చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.  చంద్రబాబుకు భయం లేదు భక్తి లేదు అసలు ఇంత జరిగిన ఆయనలో పశ్చాతాపం ఇసుమంతైన కనిపించడం లేదు అంటూ తెలిపారు. ఇక టీటీడీలో గొప్ప వ్యవస్థ ఉందని,  దీనిని చంద్రబాబు తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇక ప్రస్తుతం జగన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: