తిరుమల లడ్డూ నుంచి బయట పడటానికి ఆ లాయర్ కి భారీగా డబ్బులిస్తున్న చంద్రబాబు?

Chakravarthi Kalyan

సిద్ధార్థ్ లూద్రా. ఈ పేరు లీగల్ ఎక్స్ పర్టులలో లీగల్ ఫీల్డ్ లో ఈ పేరు మారు మోగేదే. ఆయన విమానాల్లో వచ్చి కేసులు వాదిస్తారు. ఆయన ఫీజు గంటకు లక్షల్లో ఉంటుందని అని ప్రచారంలో ఉంది. ఇంతకీ ఈ లూధ్రా ఏపీ ప్రజలకు బాగా పరిచయస్తులే. అందరికీ బాగా గుర్తుండే వ్యక్తే. గత ఏడాది చంద్రబాబు అరెస్టు అయి జైల్లో ఉంటే ఆయన తరఫున హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వాదించిన లాయర్ గా లూద్రా  అందరి మదిలో ఉన్నారు.


అప్పట్లోనే ఆయన తీసుకునే ఫీజు కూడా చర్చకు వచ్చింది. ఆయనకు అంత ఫీజు ఇచ్చి రప్పిస్తున్నారంట అని కూడా అంతా వింతగా విడ్డూరంగా చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే టీటీడీ తరఫున ఆయన శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో సుప్రీం కేర్టులో కేసు వాదించారు. ఈ కేసు అక్టోబరు 3కి వాయిదా పడింది. దాంతో ఆయన మళ్లీ వాదించనున్నారు. ఈ కేసు విషయంలో ఖరీదైన లాయరే దిగారు అని అంతా అంటున్నారు.


అయితే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రకటించింది ముఖ్య మంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు. దాని మీద గత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐ లేదా న్యాయ విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు. అయితే టీటీడీ తరఫున సిద్ధార్థ్ రావడం పట్ల చర్చ సాగుతోంది.


రాజకీయంగా  శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం చేసి ఆ మీదట దాని వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి తెచ్చిన వారు ఈ కేసు విషయంలో ఖర్చులు భరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతే తప్ప శ్రీవారికి ప్రేమతో అభిమానంతో భక్తుల హుండీల్లో  వేసిన కానుకలు నుంచి ఖరీదైన లాయర్ కి ఫీజు ఇవ్వాల్సిన అవసరం ఏం ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంత ఖర్చు పెట్టి వాదనలు వినిపించిన ఆయన లడ్డూ లో కల్తీ ఎక్కడ జరిగిందో మాత్రం చెప్పలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: