రేవంత్‌ రెడ్డి కేబినేట్‌ లో ఏక్‌నాథ్‌ షిండే..బీజేపీ స్కెచ్‌ ఇదే ?

Veldandi Saikiran
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో... రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో గులాబీ పార్టీ మళ్లీ బలంగా తయారవుతోంది. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు కూడా... గులాబీ పార్టీ విజృంభిస్తోందని వార్తలు రాసే అంతగా పుంజుకుంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఏక్ నాథ్ షిండే రెడీ అయినట్లు తెలుస్తోంది.

అతి త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గొప్ప కూల్చేందుకు ఈ ఏక్ నాథ్ షిండే... రెడీ అవుతున్నారట. ఆ ఏక్ నాథ్ షిండే  ఎవరో కాదు... తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఈడీ దాడులను ఎదుర్కొంటున్నారు. ఆయన అతి తక్కువ కాలంలోనే కాంట్రాక్టర్ నుంచి పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదిగారు. గులాబీ పార్టీలో ఉన్నప్పుడు... విపరీతంగా డబ్బులు సంపాదించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
 

అంతేకాదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు ఇచ్చి మరి... వారిని గెలిపించుకున్నారు. దాదాపు 15 నుంచి 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబ్బులు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే... తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపి ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు సమాచారం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపిలోకి తీసుకువచ్చి... రేవంత్ రెడ్డిని పడగొట్టాలని... కేంద్ర బిజెపి అనుకుంటోందట.
 

ఇందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఈడి దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈడి దాడుల పేరుతో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వశపరచుకోవాలని బిజెపి అనుకుంటోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ్రిప్ లోకి వచ్చిన తర్వాత... బిజెపి, టిఆర్ఎస్ పార్టీ, పొంగులేటి వర్గం   ఎమ్మెల్యేలు అందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: