తొలి సినిమాతో పోలిస్తే 6 లక్షల రెట్లు పెరిగిన మెగాస్టార్ పారితోషికం.. సీనియర్స్ లో టాప్ అంటూ?

Reddy P Rajasekhar
మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరివాడుగా పేరుంది. చిరంజీవి ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. పునాది రాళ్లు సినిమా నుంచి ఆచార్య సినిమా వరకు చిరంజీవి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగారు. విశ్వంభర సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఏకంగా 60 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. భవిష్యత్తు సినిమాలకు చిరంజీవి రెమ్యునరేషన్ 70 కోట్ల రూపాయలు అని భోగట్టా.
 
తొలి సినిమాతో పోల్చి చూస్తే చిరంజీవి రెమ్యునరేషన్ దాదాపుగా 6 లక్షల రెట్లు పెరిగింది. ఈ రేంజ్ లో పారితోషికం పెరిగిన మరో హీరో దాదాపుగా ఉండరనే చెప్పాలి. తొలి సినిమాకు 1116 రూపాయలు పారితోషికం అందుకున్న చిరంజీవి ఇప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తాను మెగాస్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం సీనియర్ హీరోలలో రెమ్యునరేషన్ పరంగా చిరంజీవి టాప్ అని చెప్పవచ్చు.
 
చిరంజీవి ఆరు పదుల వయస్సులో కూడా తన ఎనర్జీ లెవెల్స్ తో ఒకింత ఆశ్చర్యపరుస్తున్నారు. మరోవైపు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ నిర్వహించిన ఈవెంట్ లో చిరంజీవి అవార్డును అందుకున్నారు. అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడటం గమనార్హం. యాంకర్ మాట్లాడుతూ చిరంజీవి గత 25 రోజులుగా చికున్ గున్యాతో బాధ పడుతున్నారని తెలిపారు.
 
చిరంజీవి ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. చిరంజీవి త్వరలో మళ్లీ వరుస షూటింగ్స్ తో బిజీ కానున్నారని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చిరంజీవి కెరీర్ పరంగా రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. చిరంజీవితో సినిమా చేయడానికి ఎంతోమంది టాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవి చిరంజీవే అని ఆయనకు ఎవరూ సాటిరారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: