ఏపీ : ఈ పని చేస్తే చంద్రబాబు చరిత్రలో నిలుస్తారు..50 ఏళ్ళకే..?
ఇప్పుడు ఆ వైపుగానే అడుగులు వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనార్టీ వారందరికీ ₹4,000 పింఛన్ కు సంబంధించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైతే పింఛన్ అర్హత 60 ఏళ్లు ఉండగా.. వీటిని చంద్రబాబు 50 ఏళ్లకే పించిని ఇచ్చేలా సమగ్ర చర్యలు చేపడుతున్నారట. సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 50 నుంచి 60 ఏళ్ల మధ్య కలిగిన వారు 15 లక్షల మంది పైగా గుర్తించినట్లు సమాచారం.
అయితే వీరందరికీ కూడా పించిని అందజేసే విధానం పైన ఒక కార్య చరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారట. ముఖ్యంగా జిల్లాల వారీగా కూడా లెక్కలేసి మరి ప్రభుత్వం సేకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్హత లేకున్నా కూడా కొంతమంది పెన్షన్ తీసుకుంటున్నారని ఆస్థానంలో కొత్త పెన్షన్ దారులకు అవకాశం ఇచ్చేలా సన్నహాలు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు 50 ఏళ్లకే పింఛన్ వ్యవహారాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా ఇది చరిత్రలో నిలిచిపోతుందని కూడా చెప్పవచ్చు. మరి కొంతమంది మాత్రం ఇప్పటికే ఏపీ అప్పుల పాలయ్యింది అంటున్నారు మరి ఇలాంటి సమయంలో ఇలాంటి రిస్కు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.