జగన్ పై కొత్త ఆరోపణలు మొదలు పెట్టిన టీడీపీ? వర్క్ అవుట్ అవుతుందా?

Chakravarthi Kalyan

వైసీపీ అధినేత మీద టీడీపీ ఎప్పుడూ చాలా బిగ్ వేలోనే ఆరోపణలు చేస్తూ ఉంటుంది. ఆ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా జనాలు నమ్ముతారా అన్నది పక్కన పెడితే.. ఘాటు విమర్శలు మాత్రం చేస్తూ ఉంటుంది. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన మీద సీబీఐ కేసులు పడ్డాయి.


దానికి కాంగ్రెస్ తో పాటు టీడీపీ కూడా కారణం. ఈ రెండు పార్టీలు కలిసే కోర్టుకు వెళ్లాయని జగన్ చాలా సార్లు ఆరోపించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారని అది కూడా తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అని టీడీపీయే ఎక్కువ విమర్శలు చేసింది. అంతే కాదు రూ.లక్ష కోట్లు జగన్ వెనకేసుకున్నారు అని అదంతా సర్కారు ని అడ్డం పెట్టుకొని సంపాదించారు అని కూడా కామెంట్లు చేసింది.


అయితే లక్ష కోట్లు ఎలా లెక్కపెట్టారు అంటే దానికి లాజిక్ లేదు. కానీ అది పెద్ద నంబర్ గా ఉంటుదని వేశారు అని కూడా చెప్పుకున్నారు. ఎందుకంటే ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా అంత పెద్ద మొత్తం లేదని చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. అన్నీ కలిపి రూ.1300 కోట్లు ఉన్నాయని కూడా అంటూ వచ్చారు.


సరే లక్ష కోట్లు అంటూ 2014 ఎన్నికల దాకా టీడీపీ విమర్శించింది. అది ఎన్నికల్లో కూడా బాగానే వర్కౌట్ అయింది. 2014 ఎన్నికల్లో దీని ప్రభావం కొంత మేర కనిపించింది. ఇక 2019లో ఈ తరహా ఆరోపణలు ఏమీ లేవు.


ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ కి అడ్డుగా వచ్చిన భారీ బోట్లు వైసీపీ కి చెందనవే అని గేట్లు విరగొట్టేందుకు యత్నించి.. లక్షలాది మందిని నీళ్లలో ముంచేందుకు జగన్ చూశారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఇదే తరహా మాట వచ్చింది. జగన్ లక్ష మందిని పొట్టనపెట్టుకుందామని చూశారని ఆరోపించారు. అంటే ఇక్కడ కూడా లక్ష నంబరే వచ్చింది. జగన్ మీద భారీ ఆరోపణ చేయాలనుకున్నప్పుడు ఆ నంబర్ పెద్దదై ఉండాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారేమో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: