విరాళం ఇచ్చింది రూ.780 మాత్రమే.. కానీ అతను నిజంగా రియల్ హీరో?
అయితే ఇలా తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేసిన నేపథ్యంలో.. ఇలా సహాయక చర్యలకు గాను ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని రెండు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్థం విరాళంగా ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఇక కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాదు ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ రోజు వారి వేతనాన్ని ఇలా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందించారు అన్న విషయం తెలిసిందే. ఇలా విపత్తు సమయంలో మానవతా దృక్పథాన్ని చాటుకొని హీరోలుగా నిలిచిన వారి గురించి సోషల్ మీడియాలో వార్తలు ప్రత్యక్షమవుతున్నాయ్. అయితే ఇక్కడ ఒక వ్యక్తి డొనేట్ చేసింది కేవలం 780 రూపాయలు మాత్రమే.
కానీ అతను రియల్ హీరో అంటూ సోషల్ మీడియా అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటి 780 రూపాయలకే అంతలా హీరో అంటూ ఎత్తేయడం ఎందుకు అనుకుంటున్నారు కదా. కోట్ల రూపాయలు సంపాదించే కొంతమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల వరదలు వచ్చిన సమయంలో మాకెందుకులే అని విరాళాలు ప్రకటించకుండా సైలెంట్ గా ఉంటే.. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న ఒక సాదాసీదా రాపిడో డ్రైవర్.. తన రోజువారి సంపాదన వరద బాధితుల కోసం విరాళం ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నాడు. హైదరాబాద్ చంపపేట్ కి చెందిన సాయి అనే రాపిడో డ్రైవర్ తాను ఒకరోజు మొత్తంలో 780 రూపాయలు సంపాదించానని.. ఈ డబ్బు మొత్తాన్ని ఇక వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్ కి పంపుతున్నాను అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇది చిన్నపాటి సాయమే కానీ నా వంతుగా అయ్యింది నేను చేశాను అంటూ తెలిపాడు. దీంతో అతను రియల్ హీరో అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.