ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నేతలపై లైంగిక రూపంలో ఎక్కువగా వస్తున్నాయి వైసీపీ నేతలు ఇలాంటి వార్తల్లో నిలిచారు. అయితే అనూహ్యంగా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా తాజాగా లైంగిక వేధింపుల వివాదంలో ఇరుక్కున్నాడు. కోనేటి ఆదిమూలం ఆధారాలతో సహా అడ్డంగా బుక్కు కావడంతో అతనిపై టీడీపీ అధిష్టానం వేటు వేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అతడి లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు హైదరాబాద్‌లో మీడియా సమావేశం పెట్టింది. సత్యవేడు ఎమ్మెల్యేతో ఏకాంతంగా ఉన్న దృశ్యాలు బహిర్గతం చేసింది. తనను వేధించి లోబర్చుకున్నాడని ఆమె ఆరోపణలు చేయడం ఏపీలో పెద్ద దుమారమే రేపింది. ఎమ్మెల్యే ఇలాంటివి చర్యలకు పాల్పడటం క్షమించరాని తప్పు అంటూ అతడిని బాబు సర్కార్ సస్పెండ్ చేసింది. బాధితురాలు సొంత పార్టీకి చెందిన కార్యకర్త అని తెలిసింది. ఆమె టీడీపీ కార్యకర్త అయినా కాకపోయినా సరే ఇలాంటి చర్యలు తీసుకుంటామని టీడీపీ స్పష్టం చేసింది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపణలు వచ్చిన వెంటనే వివరణ కూడా కోరకుండా టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేయాలంటూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. ఆ వెంటనే పల్లా శ్రీనివాసరావు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తూ ఆదిమూలంకు భారీ షాకిచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలను కోనేటి ఖండించారు. హైదరాబాద్‌లో ఓ మహిళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంతో కొన్ని మీడియా సంస్థలు ఆయన వద్దకు చేరుకున్నాయి. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు తనపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచినా.. 2019 ఎన్నికల వరకు వైసీపీలోనే ఉన్నారు. వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీ ఆయనకు టిక్కెట్టు ఇవ్వడంతో మళ్లీ ఎన్నికల్లో 3 వేల ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. ఇంతకు ముందు వైసీపీ తరపున రెండు సార్లు పోటీ చేసి 2019లో గెలిచారు.