ఏపీ: కూటమికి పెరుగుతున్న ఉద్యోగుల సెగ.. చిక్కులు తప్ప వా..!

Divya
ఏపీలో ఉద్యోగ సంఘాలు గడిచిన ఐదేళ్లలో ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు సైతం నిరుత్సాహంతో ఉన్నారు. దీంతో ఎన్నికలలో వైసీపీని ఓడించడానికి ఉద్యోగులు కూడా ప్రయత్నాలు చేసి ఓడించారు. ముఖ్యంగా పి.ఆర్.సి తో సహా ఐఆర్ పింఛన్ల పథకం వంటి విషయంలో వైసిపి ప్రభుత్వానికి సెగ ఏర్పడింది. అయితే ఇప్పుడు కూటమి వచ్చి రెండు మాసాలు అవుతున్న ఉద్యోగుల పిఆర్సి విషయం పైన ఏమాత్రం నోరు మెదపకపోవడంతో ఇప్పుడు మళ్లీ గళం విప్పుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా 12 వ పిఆర్సి రిలీజ్ చేసేలోగా IR నిర్ణయించి తమకు ఇవ్వాలి అంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన పిఆర్సి నష్టాలను కూడా భర్తీ చేయాలి అంటూ డిమాండ్ ను తెలియజేస్తున్నారట. అలా గెజిటెడ్ ,నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు సైతం ఈసారి ముందుగానే సర్కార్ పైన ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు సమాచారం. నిజానికి ఉద్యోగులు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి 6 నుంచి 8 మాసాల వరకు సమయం ఇవ్వాలి. కానీ ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగానే మూడు మాసాల నుంచే కూటానికి ప్రభుత్వం పైన ఒత్తిళ్లు చేయడం మొదలుపెట్టారు.

ఇదంతా ఇలా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  రద్దు చేసిన.. వీటి పైన జరిగిన ఆన్ సైడ్ భూముల లావాదేవీలు కూటమి ప్రభుత్వం మాత్రం విచారిస్తున్నది. ఇందుకు బాధ్యులుగా మొదట అధికారుల పేర్లు వినిపించాయని వారి పైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ విషయం పైన ఉద్యోగ సంఘాలు కూడా కూటమిని వ్యతిరేకిస్తున్నాయి. గత ప్రభుత్వం చెప్పిన మేరకే మేము పని చేశామని అందులో మా తప్పు ఏమీ లేదంటూ కూడా చర్యలు తీసుకుంటే ఎలా అంటూ కూటమి నేతలను, కూటమి ప్రభుత్వంను ఉద్యోగ సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కేసుల వల్ల ఉద్యోగులను భయాందోళనకు గురిచేస్తోంది కూటమి. మరి వీటి పైన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: