జంపింగ్ జపాంగ్ హీరోలు: 'ఇదేందయ్యా.. ఇది..' రాష్ట్రంలోని అన్నీ పార్టీలను చుట్టేసోచ్చావ్..!?

FARMANULLA SHAIK
* రాజకీయాల్లో ఆరితేరిన నెల్లూరు బిడ్డ.!
* 1983 టీడీపీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశం.!
* టీడీపీ-కాంగ్రెస్-టీడీపీ-వైసీపీ-టీడీపీలోకి జంపింగ్ జపాంగ్.!
* మంత్రిగా ఎన్నో శాఖలు చేపట్టిన ఆనం.!
(ఏపీ- ఇండియాహెరాల్డ్):  ఏపీ రాజకీయాల్లో నెల్లూరుకు ఒక ప్రత్యేక రాజకీయా నేపథ్యం ఉంది రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నెల్లూరులో ఆనం కుటుంబానికి ఎనభై ఏళ్ళ సుధీర్ఘ రాజకీయా చరిత్ర ఉంది.అయితే ఆనం కుటుంబం ఒక్క నెల్లూరులోనే కాకుండా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహారిస్తుంది.ఈ కుటుంబానికి చెందిన పాత తరం నాయకులు కేవి సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి నుండి నేటి తరం ఆనం రామనారాయణరెడ్డి వరకు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినవాళ్లే.ఆనం వెంకట రెడ్డి దంపతులకు ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో జన్మించారు.ఆయన స్థానికంగా ఉన్న సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో చదువుకొని, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.కాం, బి.ఎల్ పట్టాలను పొందాడు.
ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గం నుండి  తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు.ఈ రెండు సందర్భాలలో కూడా అప్పటి సీఎం అయినా ఎన్.టి. రామారావు యొక్క మంత్రివర్గంలో రహదారులు, భవనాల శాఖమంత్రిగా పని చేశారు.తర్వాత రాజకీయంగా సంభవించిన కొన్ని అంతర్గత కారణాల వల్ల టీడీపీని వీడి 1991లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి 1999,2004 ఎన్నికల్లో మరల రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు .2007, 2009 మధ్య రామనారాయణరెడ్డి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన పర్యవసానంగా 2009 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి మారి అక్కడ నుంచి మళ్ళీ గెలిచి 2009-2012 వరకు కొనసాగిన రెండవ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ రాష్ట్ర మంత్రిగా చేశారు.తర్వాత రాష్ట్రంలో వైస్సార్ మరణంతో అధిష్టానం సీఎంగా నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డిని నియామించడంతో ఆయన హయాంలో కూడా ఆర్థికశాఖమంత్రిగా చేశారు.
ఆ తర్వాత రాష్ట్రంలో అధికారం మారడంతో తన సోదరుడు అయినా ఆనం వివేకానందరెడ్డితో కలిసి 2016లో అధికార పార్టీఐనా టీడీపీలో చేరారు.అక్కడ కూడా రాజకియంగా ఉండలేక 2019ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైస్సార్సీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.2018 లో వైసీపీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో వెంకటగిరి నియోజకవర్గం నుండి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచాడు.కానీ ఆయనకు సీఎం జగన్ మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్రిగా వ్యవహారించారు.2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాసింగ్ ఓటింగ్కు పాల్పడ్డాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన మరల వైసీపీ నుండి టీడీపీకి వెళ్లారు.దాంతో ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆత్మకూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా పోటీ చేసి ఎన్నికై ప్రస్తుతం టీడీపీలో మంత్రిగా కొనసాగుతున్నారు.ఈ విధంగా పార్టీ ఏదైనా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ప్రజల్లో విశ్వాసం సంపాదించి మంత్రి పదవికీ తాను అలంకరణ అనేది కాకుండా తనకే మంత్రి పదవి అలంకరణ అనే విధంగా ఎదిగారు. ఆయన రాజకీయా ప్రస్థానంలో మొదట టీడీపీ నుండి కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్ నుండి వైసీపీకి,ఆ తర్వాత వైసీపీ నుండి టీడీపీకి మారి మారి ఏ పార్టీలో ఉన్న తనకంటూ గుర్తింపు తెచ్చుకునే శైలి ఉన్న నాయకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: