కర్నూలు సామాన్యుడికి సారీ చెప్పిన లోకేశ్.. ఇకనైనా ఆ ఉద్యోగుల్లో మార్పు వస్తుందా?
పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్నూలుకు చెందిన రిషిక్ అనే వ్యక్తి తాను ఎదుర్కొంటున్న ఒక ఇబ్బందిని ప్రజా దర్బార్ ద్వారా 7వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు నమోదు కాగా 9వ తేదీన ఆ ఫిర్యాదు పరిష్కారం అయినట్లు రిషిక్ మొబైల్ కు మెసేజ్ వచ్చింది. సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కారమైనట్టు మెసేజ్ రావడంతో ఫీలైన రిషిక్ అధికారుల నిర్లక్ష్యం గురించి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో జగన్ సర్కార్ పాలనలో కూడా స్పందనలో చేసిన ఫిర్యాదుల విషయంలో ఇదే విధంగా జరిగిందని అధికారులు సమస్య పరిష్కరించకుండానే పరిష్కరించామని చెబుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యక్తి కామెంట్లకు నారా లోకేశ్ రియాక్ట్ అవుతూ తన విభాగంలో జరిగిన ఈ తప్పుకు సంబంధించి తనను క్షమించాలని కామెంట్లు చేశారు.
వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు. నారా లోకేశ్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నారా లోకేశ్ ఇదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రిగా నారా లోకేశ్ తీరును మాత్రం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నారా లోకేశ్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వరిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి నారా లోకేశ్ అంతంతకూ ప్లస్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు.