బెంగాల్ అత్యాచార ఘటనలో అసలు ట్విస్టులివే.. పోలీసుల జవాబులతో క్లారిటీ వచ్చినట్టే!
జూనియర్ వైద్యురాలి పోస్టుమార్టం గురించి ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ అంతా మెజిస్ట్రేట్ ఎదుట జరిగిందని పోలీసులు వెల్లడించారు. దానిని మొత్తం వీడియో తీశారని ఆ వీడియోలో ఎక్కడా కూడా ఆమె ఎముకలు విరిగినట్లు వెల్లడి కాలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. ఆమె శరీరంలో 150 ఎంజీ వీర్యం ఉన్నట్టు కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఇలాంటి సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదని వాళ్లు కామెంట్లు చేయడం జరిగింది.
ఇది మీడియాలో వివిధ రూపాల్లో చక్కర్లు కొడుతోందని పోలీసులు పేర్కొన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఆలోచనతోనే ఈ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు అన్నారు. ఈ ఘటనను అసహజ మరణంగా నమోదు చేయడం విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని కోల్ కతా హైకోర్టు వ్యాఖ్యలు చేయగా మృతి ఘటనలో ఎలాంటి ఫిర్యాదు అందని పక్షంలో మొదట అసహజ మరణంగానే కేసు నమోదు చేస్తారు.
ఈ కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని జరుగుతున్న ప్రచారంలో సైతం నిజం లేదని పోలీసులు చెబుతున్నారు. పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న వైద్యురాలు ఆస్పత్రిలో విధుల్లో ఉన్న మరుసటి రోజు అర్ధనగ్న శవమై కనిపించడం జరిగింది. ఈ కేసులో పోలీసులు పోలీస్ వాలంటీర్ అయిన సంజయ్ రావ్ ను అరెస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన మరిన్ని చిక్కుముడులు వీడే ఛాన్స్ అయితే ఉంటుంది.