కొత్త ఆర్టీసీ బస్సును నడిపిన స్టార్ హీరో బాలకృష్ణ.. అభిమానుల రియాక్షన్ ఇదే!

Reddy P Rajasekhar
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఏ రంగంలో అడుగుపెట్టినా కచ్చితంగా విజయం సాధిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. హిందూపురం నియోజకవర్గానికి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. తాజాగా హిందూపురం నియోజకవర్గంలో రెండు అన్న క్యాంటీన్లు ఏర్పాటు కాగా అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు మూడు పూటలా కడుపునిండా అన్నం లభిస్తోంది.
 
స్టార్ హీరో బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం ద్వారా వార్తల్లో నిలిచారు. బాలయ్య స్వయంగా స్టీరింగ్ పట్టి బస్సును కొంత దూరం నడిపి అభిమానుల్లో జోష్ నింపారు. బస్సు డ్రైవింగ్ చేసిన బాలయ్యను చూసి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్య కేవలం రీల్ లైఫ్ హీరో మాత్రమే కాదని రియల్ లైఫ్ హీరో కూడా అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
బాలయ్య అనుకుంటే ఏ పనినైనా సులువుగా పూర్తి చేస్తారని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తన సినిమాలలో యాక్షన్ సన్నివేశాలను డూప్ తో తెరకెక్కించడానికి కూడా బాలయ్య ఇష్టపడరని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. సినిమాల్లో హ్యాట్రిక్ సాధించిన బాలయ్య దర్శకుడు బాబి సినిమాతో డబల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టడం పక్కా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
 
సీనియర్ స్టార్ హీరోలలో బాలయ్య రూటే సపరేట్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బస్సే కాదు ఈ వాహనాన్నైనా బాలయ్య అలవోకగా నడపగలరని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య వయసు 62 సంవత్సరాలు అంటే నమ్మశక్యం కాదని మరికొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం 34 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న బాలయ్య రాబోయే రోజుల్లో 50 కోట్ల రూపాయలు రేంజ్ లో పారితోషకం అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: