మూడు ముక్కలాటకు జగన్ స్వస్తి.. అమరావతి విషయంలో తుది నిర్ణయమిదే!

Reddy P Rajasekhar
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి మూడు రాజధానులు కూడా ఒక కారణమని చెప్పవచ్చు. మొదట మూడు రాజధానుల నిర్ణయం విషయంలో పాజిటివ్ కామెంట్లు వినిపించినా అమలు విషయంలో జగన్ ఇబ్బందులను ఎదుర్కోవడం రాష్ట్ర అభివృద్ధికి ఇబ్బందులు ఎదురవడంతో మొదట ప్రశంసించిన వారే ఆ తర్వాత విమర్శించారు. అయితే అమరావతి విషయంలో జగన్ నిర్ణయం మారిందని తెలుస్తోంది.
 
విశాఖను రాజధానిగా ప్రకటించినా ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధానిగా కొనసాగనుందని తెలుస్తోంది. రాజధాని విషయంలో గందరగోళానికి తావివ్వకూడదని జగన్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. అమరావతి విషయంలో జగన్ నిర్ణయం మారితే కృష్ణా, గుంటూరు జిల్లాలలో వైసీపీకి అనుకూల పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
 
రాబోయే నాలుగున్నర సంవత్సరాలలో కూటమి సర్కార్ అమరావతిని అంతోఇంతో అభివృద్ధి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ గా ఇవ్వాలని కొంతకాలం క్రితం వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కామెంట్లు చేయడం గమనార్హం. మూడు ముక్కలాటకు జగన్ చెక్ పెడితే బాగుంటుందని కార్యకర్తలు కోరుకోగా ఆయన కోరిక నెరవేరనుందని తెలుస్తోంది.
 
జగన్ ఆలోచనలు ప్రస్తుతం 2029 ఎన్నికల్లో గెలుపుపై దృష్టి పెట్టడంపై మాత్రమే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికలతో, వ్యూహాలతో ప్రజల ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. జగన్ ను తక్కువగా అంచనా వేయొద్దని వైసీపీ హయాంలో అమలైన విధంగా ప్రస్తుతం పథకాల అమలు జరగడం లేదని చాలామంది భావిస్తున్నారు. వైసీపీ రాబోయే రోజుల్లో మరిన్ని ఎన్నికల్లో విజయాలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయనుందని సమాచారం అందుతోంది. వైసీపీ భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటే అస్సలు వదులుకోకూడదని ఫిక్స్ అయినట్టు పొలిటికల్ వర్గాల భోగట్టా.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: