ఎమ్మెల్సీగా బొత్స విజయంతో వైసీపీకి పూర్వ వైభవం.. జగన్ లక్ష్యాన్ని సాధించారుగా!
వాస్తవానికి వైసీపీకి ఈ విజయం సులువుగా దక్కలేదు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఉపఎన్నికలో గెలుపు కోసం ఎంత ప్రయత్నించినా తమ పార్టీకి గెలుపు దక్కే అవకాశం లేకపోవడంతో చివరకు చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గారు. స్వయంగా జగన్ రంగంలోకి దిగి ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపు కోసం పట్టుబట్టడం గమనార్హం. వైసీపీకి భవిష్యత్తు ఉండదని తమ పార్టీలోకి వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు వస్తారని భావించిన టీడీపీకి చివరకు నిరాశే ఎదురైంది.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో వైసీపీ 2029 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో వైసీపీకి భవిష్యత్తు ఉందని ఇప్పుడు పార్టీ మారితే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుందని స్థానిక సంస్థల ప్రతినిధులు భావించారని సమాచారం. బొత్స విజయంతో జగన్ తన లక్ష్యాన్ని సాధించారు.
జగన్ ఇదే విధంగా కష్టపడితే రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు వైసీపీ సొంతం కావడం ఖాయమని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఈ విజయంతో జగన్ కార్యకర్తల్లో సైతం జోష్ నింపారు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత పుంజుకునేలా జగన్ అడుగులు పడుతున్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో వైసీపీ పుంజుకోవడానికి జగన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. జగన్ మళ్లీ ఒక్కడే గెలుపు కోసం పోరాటం మొదలుపెట్టాడని రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు సృష్టించడం పక్కా అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.